Revathi
actress
12/06/2025
నవరాత్రి పూజ విధానం :-
ఏ పూజ అయిన సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి మీ సంకల్పము అంటే నీ కోరిక ఆయనకి చెప్పుకొని (విఘ్నేశ్వరుని పూజ మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది),, ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి,, తర్వాత అమ్మ పరివారాన్ని తలుచుకొని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి..
చదువుకోవలసినవి;వారాహి ద్వాదశ నామాలు 9సార్లు తర్వాత వారాహి కవచం, కాలభైరవాష్టకం.. మీకు ఎంత కుదిరితే అంతా అమ్మ నామస్మరణ ధ్యానం చేసుకోండి..
నైవేద్యాలు; బెల్లం పానకం,, దానిమ్మ గింజలు,,తీపి దుంపలు,,శనక్కాయలు,, బీట్రూట్ క్యారెట్ ఏదన్న సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు.. ఎరుపు పుష్పాలు సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవచ్చు..
ప్రతి ఒక్కలు కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైన దే,, ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం,,నమ్మకంతో సంతోషంగా పూజించుకొండి..
మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని వారాహి దేవి ద్వాదశ నామాలు మరియు కాలభైరవాష్టకం ఇంకా మీ వీలును బట్టి అని చదువుకోవచ్చు,, బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు రెండు పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి..
మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలసస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు..బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు ఇంట్లో వండకూడదు,,చాప వేసుకుని నేల మీద పడుకోవాలి( మీ ఆరోగ్య రిత్యా చూసుకోండి) తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి,,అతిగా తినకూడదు సాత్వికంగా తినాలి ..
10/06/2025
వారాహీ అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి.. తొమ్మిది రోజుల పాటూ బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
జై వారాహి దేవియే నమః 🙏🔱🙏
07/06/2025
లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహీని పూజిస్తే అహంకారం తగ్గుతుంది
కష్టాల్లో ఉన్నవారు , భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహీ అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది
వారాహీ అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది
అమ్మవారు సస్య దేవత..రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బావుంటుంది
వారాహీ అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది
అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ..కోరిన కోర్కెలు తీరాలని కాదు.. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏం ఇస్తే మీకు మంచి జరుగుతుందో.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
500090