Dwarampudi Chandrasekhara Reddy

Dwarampudi Chandrasekhara Reddy

Share

Kakinada City Ex-MLA

Photos from Dwarampudi Chandrasekhara Reddy's post 04/06/2026

YSR కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాకినాడ సిటీ సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికొదిలేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు,అరాచకాలు,అన్యాయాలపై వెన్నుపోటు దినం సందర్బంగా కాకినాడ లో వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం ఎన్నికల మేనిఫెస్టో మరియు బాండ్లను తగల పెట్టడం జరిగింది

Photos from Dwarampudi Chandrasekhara Reddy's post 25/05/2026

వైసిపి పార్టీ బలోపేతమే లక్ష్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లు సమావేశం*

ఎస్ఐఆర్ పేరుతో వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపుకు కుట్ర : అప్రమత్తంగా ఉండాలి

పార్టీ శ్రేణులు, బూత్ కమిటీలు జాగ్రత్తగా వ్యవహరించాలని దాడిశెట్టి రాజా, ద్వారంపూడి పిలుపు

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పేరుతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లను తొలగించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోని డే కన్వర్షన్ సమావేశ మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్వడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకుల ఓట్లను తొలగించే ప్రయత్నాలుజరిగేఅవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో పార్టీ తరఫున పనిచేసే బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిడితో ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌లు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Want your public figure to be the top-listed Public Figure in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Kakinada