Padala Rahul
𝐌𝐞𝐦𝐛𝐞𝐫 - 𝐑𝐞𝐠𝐢𝐨𝐧𝐚𝐥 𝐓𝐫𝐚𝐧𝐬𝐩𝐨𝐫𝐭 𝐀𝐮𝐭𝐡𝐨𝐫𝐢𝐭𝐲 (𝐆𝐨𝐯𝐭 𝐨𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚) | 𝐒𝐭𝐚𝐭𝐞 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐒𝐞𝐜𝐫𝐚𝐭𝐚𝐫𝐲 -𝐓𝐏𝐘𝐂, 𝐅𝐢𝐫𝐬𝐭 (𝐄𝐥𝐞𝐜𝐭𝐞𝐝)𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 - 𝐃𝐘𝐂𝐂, 𝐊𝐚𝐫𝐢𝐦𝐧𝐚𝐠𝐚𝐫
తెలంగాణ టైగర్, గురువర్యులు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నేడు కరీంనగర్ లోనీ ఇందిర చౌక్ వద్ద రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు, అర్బన్ బ్యాంకు చైర్మెన్ కర్ర రాజశేఖర్ గారు, పొన్నం సత్యం గారు, పొన్నం అనూప్ గారు, కరీంనగర్ కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
01/05/2026
*కరీంనగర్ డిపో-1,2లో మే డే వేడుకలు: సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు ఆర్టీఏ మెంబర్ రాహుల్ పాలాభిషేకం*
**50 రోజుల సమ్మెను పట్టించుకోని గత సర్కార్, 2 రోజుల్లోనే డిమాండ్లు ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం: పడాల రాహుల్*
మే 1 కరీంనగర్ బి.ఆర్.అంబేద్కర్ బస్ స్టాండ్
*ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు కరీంనగర్ బస్ డిపో 1లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులు, పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్ర పటాలకు పాలాభిషేకం చేసినారు.*
అనంతరం కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు..
2 డిపోలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంజన్ కుమార్ గారు జెండా ఆవిష్కరణ చేసి మేడే నీ ఉద్దేశించి మాట్లాడరు..
తర్వాత జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ 1మరియు 2 డిపో కార్మికులు, డిపో మేనేజర్ లు, ఆర్.టి.సి కార్మిక సంఘాల నాయకులతో కలసి
దశాబ్దాల కల అయినట్టు వంటి ఆర్.టి.సి కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి, 11% పి.ఆర్.సి పెంపు, ఆర్.టి.సి ని ప్రభుత్వంలో విలీనం మరియు మిగతా 30 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రావాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గార్ల చిత్ర పటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు..
ఈ సందర్భంగా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మాట్లాడుతూ
1886 లో అమెరికా వేదికగా జరిగిన 8 గంటల పని, 8 గంటల పని సడలింపు కై పోరాటం లో అమరులు అయిన కార్మిక సోదరులకు నివాళాలు తెలియచేశారు, వారు నింపిన స్పూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఘాల నాయకులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో " బస్ కా పయ్యా నహి చెలేగా" అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్.టి.సి కార్మిక సోదరులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచి పోతుంది, గత కెసిఆర్ ప్రభుత్వం లో ఆర్ టి సి కార్మికలు 50 రోజుల పాటు సమ్మె చేస్తే నాడు కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నిలిచి అండగా ఉన్నామని గుర్తు చేశారు, ఆనాడే రానున్నది ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వచ్చిన తర్వాత ఆర్ టి సి కార్మికుల డిమాండ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినం, ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కొన్ని ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల కొంచం ఆలస్యమైన మాట వాస్తవం, కార్మికులు 33 డిమాండ్ల తో సమ్మె కి పిలుపునిస్తే
అందులో ప్రధాన మైన 3 డిమాండ్లు
11% పి ఆర్.సి పెంపు , ఆర్ టి సి నీ ప్రభుత్వంలో విలీనం, సంఘాల ఎన్నికలు వంటి డిమాండ్లను కేవలం 2 రోజుల సమ్మెతో తోనే కార్మిక సోదరులు చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి కేబినెట్ ఉప కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో డిమాండ్ల పై సానుకూలంగా స్పందించి ఆమోదించడం అనేది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన తొలి సంతకం మహిళకు ఫ్రీ బస్ కార్యక్రమం, ఫ్రీ బస్ స్కీమ్ ను చిత్తశుద్ధి తో ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు ఆర్ టి సి కార్మికులకు ధన్యవాదాలు,
రాష్ట్ర రావాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలంగా ఆర్ టి సి నీ ముందుకు తీసుకువెళ్ళి పేద ప్రజలకి లైఫ్ లైన్ అయిన ఆర్ టి సి కి అలాగే ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రావాణా శాఖ మంత్రి పొన్నం గార్లకు మరింత గొప్ప పేరు తీసుకురావాలని కోరారు..
కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు జక్కుల మల్లేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ భూమయ్య గారు, ఆకుల ఉదయ్ గారు,
యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జారిపోతుల వాసు గారు, ప్రధాన కార్యదర్శి కొయ్యాడ వేణు గౌడ్ గారు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సుఫియాన్ ఎంప్లాయ్ యూనియన్ రీజినల్ ప్రెసిడెంట్ ప్రకాష్, కార్మిక సంఘ నాయకులు మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు కరీంనగర్ బస్ డిపో 1లో కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడరు తరువాత మెటాయి పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు..
18/04/2026
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ మండలం, రామక్రిష్ణ కాలనీ లో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల లో ఏర్పాటు చేసిన
ARRIVE ALIVE ( Road Safety) కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ గారితో కలసి పాల్గొన్న రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ గారు
వాహన దారులకు కంటి పరీక్ష, హెల్త్ చెకప్ క్యాంప్ ను అడిషనల్ కలెక్టర్ గారితో కలసి ప్రారంభించినారు
తదుపరి డ్రైవర్ లకు, విద్యార్థులుకు, వాహనదారుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని రోడ్ భద్రతా పై అవగాహన కల్పించారు
30 ఏండ్లు గా ఆక్సిడెంట్ రహిత డ్రైవింగ్ చేసిన ఉత్తమ డ్రైవర్లకు పురస్కారం అందచేశారు..
కార్యక్రమంలో DTC పురుషోత్తం గారు, అడిషనల్ డిసిపి వెంకటరమణ గారు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు గారు, డిఎంహెచ్ఓ వెంకటరమణ గారు, DTO శ్రీకాంత్ చక్రవర్తి గారు, MVI రవి కుమార్ గారు, AMVI లు స్రవంతి గారు, హరిత యాదవ్ గారు, ఉమ్మడి జిల్లా MVI లు, AMVI లు, జిల్లా రోడ్ సేఫ్టీ సభ్యులు పాల్గొన్నారు..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Karimnagar
505001