Pilgrimage India
India has rich cultural and historical heritage well preserved in its temple architecture and pilgrim sites.
20/08/2016
--: శ్రీవేంకటేశ్వర కరావలంబ స్తోత్రం :--
=======================
శ్రీ శేషశైల సునికేతన దివ్య మూర్తే
నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష!
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త!
కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీ పద్మనాభ కమలార్చిత పాదపద్మ!
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోష పరిహారితబోధదాయిన!
దైత్యాదిమర్దన జనార్ధన వాసుదేవ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
తాపత్రయం హరవిభో రభసాన్మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష!
మచ్చిష్య ఇత్యనుదినమ్ పరిరక్ష విష్ణో
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికా తిలక శోభిలలాటదేశ!
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
వందారులోక వరదాన వచోవిలాస
రత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠ!
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూర భూషణ సుశోభిత దీర్ఘబాహొ!
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
స్వామిన్! జగద్దరణ వారధి మధ్యమగ్నం
మాముద్దరాధ్య కృపయా కరుణాపయోధే!
లక్ష్మీంచ దేహి విపులామృణవారణాయ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్క దీప్తే!
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
రత్నాడ్యధామ సునిబద్ద కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ!
జంఘాధ్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
లోకైక పావన లసత్పరిశోభితాంఘ్రి
త్వత్వాద దర్శన దినేశ మహాప్రసాదాత!
హార్ధం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
కామాది వైరినివహో ప్రియ మాం ప్రయాతః
దారిద్య్రమప్యగతం సకలం దయాళో!
దీనంచ మాం సమవలోక్య దయార్ద్రదృష్యాం
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం!!
శ్రీ వేంకటేశ పాదపంకజషట్పదేస
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యామ !
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారేః !!
Pilgrimage India India has rich cultural and historical heritage well preserved in its temple architecture and pilgrim sites.
29/10/2013
శివాభిషేక ఫలములు
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
29/10/2013
దీపావళి రోజున లక్ష్మీపూజ
"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్|
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే||"
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అలాంటి దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.
ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో.. తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా.. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.
ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. నీవు అనుకున్నట్లు శ్రీహరి అంత సంకుచిత మనస్కుడు మాత్రం కాదు.
"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
తిరుమల గురించి కొన్ని నిజాలు
1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు.స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూచూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.
Click here to claim your Sponsored Listing.