Boranchu Srikanth Reddy
Boranchu Srikanth Reddy
AMC Chairman - Adilabad
(Telangana Pradesh Kisan Congress State General Secretory)
19/05/2026
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాల రాస్తుంది: కుసుమ్ ఆలం*
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది - బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
ఆదిలాబాద్: లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామంలో నిర్వహించిన ఆదివాసి గూడాల పర్యటన కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కుసుమ్ ఆలం, డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్‌తో కలిసి గ్రామస్తులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కుసుమ్ ఆలం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదివాసీల సంక్షేమం కోసం పని చేస్తోందని అన్నారు.అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీ యువత విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసరమన్నారు.కార్యక్రమంలో భాగంగా ఆదివాసి సంప్రదాయం ప్రకారం గ్రామస్తులతో కలిసి కుసుమ్ ఆలం, డా. నరేష్ జాదవ్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సెడమాకి ఆనందరావు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కుంర సత్యవతి కోటేష్, వైజాపూర్ గ్రామ సర్పంచ్ సీతాబాయి-వెంకట్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
19/05/2026
మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కూతురి వివాహ వేడుకకు హాజరైన బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
హైదరాబాద్‌లోని మెట్రో క్లాసిక్ గార్డెన్‌లో సోమవారం రాత్రి మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కూతురి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌తో పాటు పెళ్లి కుమారుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌ను కలిసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు పాల్గొన్నారు.
19/05/2026
జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లు
👉🏼తెలంగాణ అవతరణ దినోత్సవం నుంచి కొత్త పింఛన్లు
👉🏼రాష్ట్రంలో 2 లక్షల మందికి కొత్త పింఛన్లు అందజేత
👉🏼ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి
👉🏼రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జూన్ లో ప్రారంభం
5కే మారథాన్‌లో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 5కే మారథాన్ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన పాల్గొని యువతలో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరాన్ని తెలిపారు.ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను మంచి మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువత, క్రీడాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ పరిధి రైతుల జొన్నలకే ప్రాధాన్యం*
షెడ్యూల్ ప్రకారమే జొన్నలు తీసుకురావాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వచ్చే రైతులు మాత్రమే జొన్నలను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.దళారులు ఇతర ప్రాంతాల నుండి జొన్నలను ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకువస్తున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతుల జొన్నల కొనుగోలు పూర్తిచేసిన అనంతరం జిల్లాలోని ఇతర ప్రాంతాల రైతుల జొన్నల కొనుగోలు చేపడతామని స్పష్టం చేశారు.షెడ్యూల్ ప్రకారం జొన్నలు తీసుకువచ్చిన రైతుల కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా అధికారులు కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే మార్కెట్ యార్డుకు జొన్నలను తీసుకురావాలని కోరారు.
శనివారం మార్కెట్ యార్డును సందర్శించిన శ్రీకాంత్ రెడ్డి కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, మార్కెట్‌లో పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహిస్తామని తెలిపారు.
రాజీవ్ గాంధీ జ్యోతి యాత్రకు ఘన స్వాగతం*
రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తి : బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
ఆదిలాబాద్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీలోని వీరభూమి వరకు కొనసాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఆదిలాబాద్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా నియోజకవర్గం ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డితో కలిసి బోరంచు శ్రీకాంత్ రెడ్డి డీసీసీ కార్యాలయంలో జ్యోతి యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తూ ఆధునిక భారత నిర్మాణానికి ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.రాజీవ్ గాంధీ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రతి ఏడాది రాజీవ్ గాంధీ స్మారక జ్యోతి యాత్ర నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యం మరియు యాత్ర బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
16/05/2026
*రిసెప్షన్ వేడుకలో నూతన దంపతులను ఆశీర్వదించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి*
ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన గౌతమ్ పవార్-హరిప్రియ వివాహ రిసెప్షన్ వేడుకలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కలిసి ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Adilabad
504001