CPM ADONI
పొలిటికల్ పార్టీ
29/10/2025
#తుంగభద్ర #నదిపై #మేలిగనూరు #దగ్గర #వరద #కాలువ #నిర్మించాలి #వేదవతి #ప్రాజెక్టు #వెంటనే #పూర్తి #చేయాలి #అక్టోబర్ #31న #సదస్సును #జయప్రదం #చేయండి.
కౌతాళం మండలం మేలిగినూరు దగ్గర తుంగభద్రా నదిపై వరద కాలువ నిర్మించాలని, ఆదోని మండలంలోని కొండలలో ఇస్వి, సుల్తానాపురం, కపటి చెరువులను నింపాలని,తక్షణమే వేదవతి ప్రాజెక్టు పనులు ప్రారంభించి *ఆదోని మండలానికి సాగునీరు మరియు త్రాగునీరు అందించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీన అదొనిలోని సుందరయ్య భవన్ లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజనేయులు ఎం. ఉ చ్చిరప్ప, ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆదోని మండలంలో సారవంతమైన భూములు ఉన్నప్పటికీ సాగునీరు లేక రైతుల కేవలం వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని వర్షాకాలం ముగిసిన వెంటనే కూలీలతో పాటు రైతులకు కూడా వేరే ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జరిగే పోరాటానికి ఆదోని మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులు కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశ్వర్లు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Adoni
518301