I&PR
Information & Public Relation Department DIPRO_ELURU
Eluru,Andhra Pradesh,India
03/06/2026
3.6.2026_ఏలూరు_ జిల్లాలో అటవీ వంటి ప్రాంతాల గుర్తింపు, డిజిటైజ్, జియో-రిఫరెన్స్ పనులు వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం అటవీ భూములు మరియు అటవీ-వంటి ప్రాంతాలను గుర్తించి, డిజిటైజ్ చేసి, జియో-రిఫరెన్స్ పనుల ప్రగతిపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ రికార్డులలో అడవులుగా నమోదు చేయబడిన భూములు, గెజిట్ నోటిఫికేషన్లు, బ్లాక్ మ్యాప్‌లు మరియు KML లేయర్‌లను ఉపయోగించి అటవీ బ్లాక్‌ల డిజిటైజేషన్ మరియు జియో-రిఫరెన్సింగ్‌తో పాటు, క్షేత్రస్థాయి ధృవీకరణ చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలో జిల్లాలో నోటిఫైడ్ అడవులు అన్-నోటిఫైడ్ అడవులు, ఆక్రమణలు, RoFR ప్రాంతాలు, క్షీణించిన మరియు చెట్లు లేని భూములు, మరియు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ తోటల పెంపకంపై డేటా సేకరణ చేయాలన్నారు.
#వెట్రిసెల్వీ
ForestConservation
02/06/2026
2.6.2026_ రానున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టే పనులకు సంబందించి సంబంధిత శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులు మంజూరు చేసిన పనుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏలూరు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో చేపట్టే పనుల ప్రతిపాదనలపై మంగళవారం అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నాన ఘట్టాలు, నది గట్లు పటిష్టం వంటి పనులతో పాటు విద్యుత్, రోడ్లు, పర్యాటకం, దేవాదాయ, ప్రజా రవాణా వ్యవస్థ, తదితర శాఖలకు సంబంధిత ఆయా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించిన ప్రతిపాదనలలో ఆయా శాఖలు మంజూరు చేసిన పనులు, నిధులకు సంబందించిన సమాచారాన్ని వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Deputy Executive Information Engineer, I&PR Dept.
Eluru
534001
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |