CN Reddy Corporator

CN Reddy Corporator

Share

GHMC Ex.Corporator-Rahmath Nagar Division-102
GHMC Standing Committee Member

19/06/2026

SPR Hills గ్రౌండ్ గేట్ పనుల పరిశీలన!

రహమత్ నగర్ డివిజన్ Ex. కార్పొరేటర్ శ్రీ CN REDDY గారు ఈ రోజు స్థానిక ఎస్.పి.ఆర్ హిల్స్ గ్రౌండ్‌ను సందర్శించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్ పనులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని, పరిశీలించారు. పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. స్థానిక కాలనీల సౌకర్యార్థం, డివిజన్ అభివృద్ధి పనులపై నిరంతరం నిఘా ఉంచుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Photos from CN Reddy Corporator's post 19/06/2026

బ్రహ్మ శంకర్ నగర్ కమిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ CN REDDY

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న బ్రహ్మ శంకర్ నగర్ కమిటీ హాల్ పనులను మాజీ కార్పొరేటర్ CN REDDY గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ హాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటి సకాలంలో పూర్తికి కృషి చేస్తున్నామని CN REDDY గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Rahamath Nagar
Hyderabad
500045