Real Estate

Real Estate

Share

CEO - Marketing in Landmark |Expertise in the Real Estates in Leadership

12/09/2024

మీ ఫ్లాట్ ఎఫ్ టి ఎల్ లో ఉందా..? అయితే ఎలా చెక్ చేసుకోండి.

కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారం చేశారు. లేక్ వ్యూ, లేక్ ఫ్రెండ్ అంటూ కొత్త మార్కెటింగ్ సృష్టించి లాభాలు పొందారు. జల వనరుల కాపాడాల్సిన అధికార యంత్రాంగాన్ని ఏమార్చి ఎన్వోసీల పేరిట దగా చేశారు. దాంతో చెరువులో కొండలు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. భారీ వరదలు వస్తే ఆ వరద ఎక్కడికి వెళ్లాలో అంతుచిక్కక కాలనీ కాలనీలను ముంచిత్తుతున్నది. దీంతో చెరువులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతం నిర్ణయం తీసుకున్నారు హైడ్రాను స్థాపించి జల వనరులను సంరక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ స్థలం ఇల్లు ఎఫ్ఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలియక ఆందోళన సామాన్యులు కనిపిస్తున్నది. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి సైతం అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

⭐ చెరువు నిండితే ఎక్కడ దాకా నీళ్లు వస్తాయో అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టి ఎల్) వాటర్ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి చెరువు చుట్టూ ఉంటుంది.
⭐ ఎఫ్ టి ఎల్ కి ఓవైపు కొంతమేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బఫర్ జోన్లను నిర్దేశించారు. ఇది ఎఫ్టిఎల్ నాలా సైజుని బట్టి ఉంటుంది.
⭐ నాళాలు చెరువుల మ్యాప్ల్లో ఎఫ్టీఎల్ బౌండరీస్ చూపిస్తారు. బఫర్ జోన్ కి కూడా అక్షాంశాలు రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్ లో రెవెన్యూ సర్వే నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్ రెవెన్యూ రూల్ బుక్ ప్రకారం చేస్తారు.
⭐ చెరువు, కుంట, శిఖం భూములు బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
⭐ హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ పరిధిలో నదులకు ఇరువైపులా కనీసం 50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.
⭐ పది హెక్టార్లు లేదా 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 9 మీటర్ల కెనాల్/నాలా వరద కాలువ ఉంటుంది.
⭐ పది హెక్టార్ల కంటే తక్కువగా ఉండే చెరువులు కుంటలకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. రెండు మీటర్ల కెనాల్/ నాలా వరద కాలువ ఉంటుంది.

ఎలా తెలుసుకోవాలి?

హెచ్ఎండిఏ పరిధిలో చెరువు విస్తీర్ణం ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ వంటి అన్ని వివరాలు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
https://lakes.hmda.gov.in వెబ్సైట్ కి వెళ్ళాలి. అందులో జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఊర్లోని అన్ని చెరువులు వివరాలు వస్తాయి.

24/08/2024

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాలపైనే అందరి చూపు.. ఇంటి స్థలం కొంటే బంగారుమయమే!

దేశంలోని పెద్ద నగరాలకు ధీటుగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగరంగా అవతరిస్తోంది. భాగ్యనగరంలో ఉపాధి కోసం వచ్చే వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నగరం అన్ని రకాల సౌకర్యాలకు నెలవుగా ఉంది. జనాభా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అందుకు తగ్గట్లుగానే మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. నగర శివార్లలోనూ మెరుగైన రవాణా ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో కొత్త నగరం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని భూములకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అంతే కాదు హైదరాబాద్ నలు మూలల నగర శివార్లపై ఇప్పుడు భూముల కొనుగోలుదారుల చూపు పడిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు దాటి నగరం విస్తరిస్తోంది. ప్రభుత్వం సైతం అక్కడి వరకు రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు శివార్ల నుంచి సిటీకి వస్తోంది. ఎంఎంటీఎస్ రైళ్లు సైతం పరుగులు పెడుతున్నాయి. దీంతో శివారు ప్రాంతాలు నగరానికి ఎంతో చేరువయ్యాయి. ఒకప్పుడు మేడ్చల్ వెళ్లాలంటేనే చాలా దూరం అనే వారు. ఇప్పుడు అది సిటీలో ఒక భాగమైపోయింది. అదే విధంగా ఘట్‌కేసర్, ఉందానగర్ ప్రాంతాలు సైతం ఒక్కప్పుడు సిటీకి చాలా దూరం అనుకునే వారు. కానీ ఇప్పుడు అక్కడి వరకు సిటీ విస్తరిస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయినప్పటికీ నగరంలోని ధరలతో పోలిస్తే అందుబాటులోనే ఉండడంతో నగర శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తమకు అనువైన ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.

21/08/2024

రియల్​ ఎస్టేట్​ బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా?- వచ్చే ఆరునెలల్లో ఏం జరుగుతుందంటే!

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్థానికతపైనే ఎక్కువగా ఆధారపడినా ఈ రంగంపై రాష్ట్ర, దేశ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు అంతిమ ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక, ఇతర పరిణామాల ప్రభావం కూడా రియల్​ రంగంపై అధికంగా ఉంటోంది. ప్రభుత్వ వర్గాల్లో మార్పులు, రాజకీయ, బడ్జెట్‌ సంబంధిత నిర్ణయాలతో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో రియల్​ ఎస్టేట్​ రంగం పయనమెటు అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని మార్కెట్‌ ప్రతిబింబించినట్లు నైట్‌ ఫ్రాంక్, నరెడ్కో సెంటిమెంట్‌ సర్వేలు వెల్లడించాయి.

హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు - High land cost in Hyderabad

రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని జాతీయ స్థాయిలో పోల్చి చూస్తే ప్రస్తుత సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు, భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోరు ఒకేలా నమోదయ్యాయి. ఈ రెండు ఫలితాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 65గా నమోదయ్యాయి. ఈ స్కోరు వందకు చేరువగా ఉంటే రియల్​ రంగం చాలా సానుకూలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. స్కోరు తగ్గుతున్నా కొద్దీ సెంటిమెంట్‌ అంత బలంగా లేనట్లు భావించాల్సి ఉంటుందంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. మొదటి త్రైమాసికంలో 72గా ఉన్న స్కోరు రెండో త్రైమాసికంలో 65కి తగ్గిపోవడంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరింత జాగ్రత్తగా ఉంటూ ఆశావాదం వైపు మారడాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 65 స్కోరూ సానుకూలమే, 50 ఉంటే తటస్థం, అంతకంటే ఎక్కువ ఉంటే సానుకూల భావాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలన్నీ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, సానుకూతను వెల్లడిస్తున్నాయి. దీంతో ఇళ్లు, అపార్ట్​మెంట్లు, ఆఫీస్​ స్పేస్​ మార్కెట్‌లలో స్థిరమైన వృద్ధిని సర్వే అంచనా వేస్తోంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏమంటున్నాయంటే!

రియల్​ రంగం అభివృద్ధిపై డెవలపర్లు సానుకూల ధోరణితో ఉన్నారు. డెవలపర్లు కాని భాగస్వాములైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పీఈ ఫండ్స్‌ సంస్థల అభిప్రాయం కూడా అనుకూలమే. వీరిచ్చిన స్కోరు 68ని పరిశీలిస్తే ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ స్కోరు తొలి త్రైమాసికం 73తో పోలిస్తే తగ్గినప్పటికీ ఆశావహ ఫలితాలను చూపుతోంది.

ధరలు పెరుగుతాయని..

వచ్చే ఆరునెలల్లో స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని బిల్డర్ల అంచనా. అత్యధికంగా 63 శాతం మంది బిల్డర్లు స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ధరలు నిలకడగానే ఉంటాయని 36 శాతం మంది చెబితే.. తగ్గుతాయని చెప్పింది కేవలం ఒక్కశాతమే. విక్రయాలు పెరుగుతాయని 51 శాతం మంది, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు ఉంటాయని 61 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉన్నదని గుర్తు చేస్తూ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు.

రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. స్వల్పకాలిక సవాళ్లు ఎదుర్కొని అభివృద్ధి చెందడానికి ఉన్న అన్ని అవకాశాలను మార్కెట్​ గమనిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సహా డెవలపర్లు, కీలక భాగస్వాములు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తుపై బలమైన విశ్వాసంతో ఉన్నాం.

Want your business to be the top-listed Realtor/realty Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


LB Nagar
Hyderabad
500068