APWJF

APWJF

Share

Andhra Pradesh Working Journalists Fedaration small and Medium newspapers and News Channels covering Twenty Three District Unions in the State.

Photos 28/06/2013

కదం తొక్కిన కలం కార్మికులు
హైదరాబాద్ లో జర్నలిస్టుల మహా ప్రధర్శన
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యుజె ఎఫ్) ఆద్వర్యంలో జూన్ 26న బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు జర్నలిస్టులు మహా ప్రదర్శన జరిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది జర్నలిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రామీణ విలేకరులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ఇళ్ళస్థలాలు కేటాయించాలని, జర్నలిస్టులకు చట్టబద్దమైన రక్షణ కల్పించాలని ప్రధర్శనలో నినదించారు. సమాఖ్య అద్యక్షుడు బసవ పున్నయ్య,ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు కార్యదర్శులు సంజీవరెడ్డి,సత్యనారాయణ,కోటేశ్వర్ రావు,సోమయ్య, ఉపాద్యక్షులు జి.శ్రీనుబాబు,ఎ.శేఖర్ ,కె.వేణుగోపాల్, సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యులు ఎ.అమరయ్య,కె.మంజరి,పి.ఆనందం కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ప్రారంబమైన ప్రధర్శన వీఎస్టీ,ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, ఇందిరా పార్క్ చౌరస్తాల మీదుగా ధర్నాచౌక్ వరకు సాగింది. అనంతరం దర్నాచౌక్ లో సమాఖ్య అధ్యక్షుడు బసవ పున్నయ్య అద్యక్షతన జరిగిన సభలో హెచ్ ఎం ఎస్ నాయకుడు , టిఆర్ ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, టిఎన్ టియుసి నాయకుడు రాంబాబు పాల్గొని జర్నలిస్టులకు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా నాయిని నర్శింహారెడ్డి మాట్లాడుతూ జర్నలిజం ఉంటేనే ప్రపంచానికి విజ్ఞానం, వెలుగు ఉంటాయన్నారు. సమాజంలో డబ్బు, హోదా లేకుంటే విలువలేని పరిస్థి నెలకొందని, విలువలతో కూడిన జర్నలిజాన్ని నిలబెట్టాలన్నారు.సమాజం వక్రమార్గంలో నడవకుండా సక్రమమైన మార్గంలో నడిపించేది జర్నలిస్టులేనని చెప్పారు. నాయకులను తీర్చిదిద్దే శక్తితో పాటు వారిని పడగొట్టే యుక్తి జర్నలిస్టులకు ఉందన్నారు. అవినీతిపరులను నిలదీస్తున్న జర్నలిస్టులు నీతిమంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా సమస్యలపై పోరాటం సాగించే వారికి జర్నలిస్టులు మద్దతుగా నిలవాలన్నారు.

అంకితభావంతో పనిచేస్తూ యాజమాన్యాల ప్రతిష్టను పెంచుతున్న జర్నలిస్టుల విలువను పెంచటంలో యాజమాన్యాలు ముందుకు రాకపోవటం దురదృష్టకరమన్నారు.పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి హెచ్ ఎం ఎస్ , టిఆర్ ఎస్ ల సంపూర్న మద్దతు ఉంటుందన్నారు. టిఎన్ టియుసి నాయకులు రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఆలోచన చేయలేని స్థితిలో ప్రభుత్వముందని, ఇది చాలా దుర్మార్గమన్నారు. జర్నలిస్టులకు 60గజాల స్థలం ఇవ్వలేని ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తుందో మనకర్ధమవుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. డిమాండ్ ల సాధన కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి టిఎన్ టియుసిసంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యులు అమరయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు జస్టిస్ గురుభక్ష్ మతీజియా సిపార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నిజమైన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమాఖ్య పోరాటం చేస్టుదన్నారు. జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో ఐ&పిఆర్ , డిపిఆర్వో కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్దమవు తామన్నారు. ఎపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల కన్నా అధ్వాన్నంగా నేడు కలం కార్మికులు బతకాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవ చేసే వారికి రాయితీలు ఇచ్చే ప్రభుత్వం వారిని విశ్లేశించే జర్నలిస్టుల సమస్యలపై దృష్టి ఎందుకు సారించదని ప్రశ్నించారు. సమాఖ్య జాతీయ సమన్యయ కమిటీ సభ్యురాలు మంజరి మాట్లాడుతూ అభద్రతాభావంతో పనిచేయాల్సిన దుస్తితి జర్నలిస్టులకు ఏర్పడిందన్నారు. కనీస వేతన చట్టం లేకపోవటం దుర్మార్గమన్నారు. మీడియా సంస్థల్లో లైంగిక వేదింపుల నిరోధక కమీతీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో జర్నలిస్టుల కొరకు ప్రభుత్వం నియమించే అన్ని కమిటీల్లో ఫెడరేషన్ కు స్థానం కల్పించాలన్నారు. జర్నలిస్టులందరికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, సభ్ ఎడిటర్లకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. సమాఖ్య కార్యవర్గ సభ్యురాలు శాంతి, హెచ్ యు జె కార్యదర్శి ఎఱం నర్సింగ్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Hyderabad
500020