Chandra Rajeswara Rao Foundation for Social Progress
Chandra Rajeswara Rao Foundation To translate into deeds of Chandra Rajeswara Rao ideals and aims, the CR Foundation decided to take up a number of projects.
18/12/2025
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు
17-12-2025
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కారించుకొని
ఈరోజు CR ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కాలనీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది.
CR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా సంక్షేమ కేంద్రం ఆవరణలో జరిగిన ముగ్గుల పోటీలలో
విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవులు, సి ఆర్ ఫౌండేషన్ ట్రెజరర్ వి. చెన్నకేశవ రావు మాట్లాడుతూ " *పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు"* అని అన్నారు. " *ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. నేటి యువతరం కూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించేందుకై ఈ పోటీలు నిర్వహిస్తున్నాము"* అని అన్నారు. " *ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటాయి. గోమయంతో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమలు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమి కీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక శ్రమతో పనిచేయవలసి ఉంటుంది. ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహిళలలో అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ మొత్తం నెలరోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝామున లేచి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు"* అని అన్నారు. పోటీలలో విజేతల ఎంపికలో మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి జోస్యభట్ల కల్పన జడ్జీగా వ్యవహరించారు. ఈ పోటీలలో 75 మంది విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ కేంద్రం కమిటీ సభ్యులు శ్రీమతి వి. లలిత, శ్రీమతి వంక లక్ష్మి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
15/12/2025
సి ఆర్ పాలిక్లినిక్ , రోటరీ ప్రోలిఫిక్స్ డయాగ్నస్టిక్ కేంద్రం మరియు హైదరాబాద్ మేవరిక్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యములో ఉచిత మెగా వైద్య శిబిరం :
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రేస్
(సీఆర్ ఫౌండేషన్) ఆధ్వర్యములో నడుస్తున్న సీఆర్ పాలిక్లినిక్, రోటరీ ప్రొలిఫిక్స్ డయాగ్నస్టిక్ సెంటర్
ఈరోజు బస్తీ దవాఖాన ప్రేమనగర్ న్యూ హఫీజ్ పెట్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరములో సీ ఆర్ పాలిక్లినిక్ జనరల్ మరియు స్త్రీ వ్యాధుల వైద్య నిపుణులు డా. కె. రజని , డా. అరుణ , డా. కేజియా, దంత వైద్యులు డా. అజయ్, డా. ప్రశాంతి, ఫిజియోథెరపీ వైద్యులు డా. అనిల్ చంద్, MAA హాస్పిటల్ నుంచి చెవి ముక్కు గొంతు వైద్యులు డా. ముదిత్, కిమ్స్ హ్సాపిటల్ నుంచి పిల్లల వైద్యులు డా. యుక్త వర్మ, త్రిష, శుభ్ర, సీనియర్ హోమియోపతి డా. సి హెచ్. ప్రభావతి, జేఎస్పీఎస్ గవర్మెంట్ హోమోయోతి కాలేజ్ డాక్టర్లు సంయుక్త , స్నేహిత, సింధూజ, విశాల్ తమ సేవలు అందించారు. సీఆర్ పాలిక్లినిక్ రోటరీ ప్రొలిఫిక్స్ డైగ్నోస్టిక్ సెంటర్ టెక్నికల్ పార్టనర్ కనెక్ట్ డైగ్నోసిస్ వారు ఉచిత రక్త పరీక్షలు , హీలియోస్ లంగ్ సెంటర్ వారు పిఎఫ్టీ పరీక్షలు, ఎల్ వి ప్రసాద్ నేత్రాలయం డా. రమ్య , డా. రాజేశ్వరిత్, డా. శిల్ప నేత్ర చికిత్సలు నిర్వహించారు.
ఈ శిబిరం ఏర్పాటులో హైదరాబాద్ మ్యావరిక్స్ రోటరీ క్లబ్ సభ్యులు గోగినేని శేఖర్, డి. లక్షినారాయణ, వాసిరెడ్డి నాగేశ్వర రావు, కె అజయ్ కుమార్ , డి. అనిత ఇతరులు తోడ్పాటు అందించారు. 250 కి పైగా ప్రేమనగర్ వాసులు ఈ ఉచిత వైద్య శిబిర సేవలు సినియోగించుకున్నారు.
వైద్య శిబిరం విజయవంతం కావటానికి సహకరించిన సిఆర్ పాలిక్లినిక్, రోటరీ ప్రోలిఫిక్స్ డైగ్నోస్టిక్ సెంటర్,
సిఆర్ ఫౌండేషన్ సిబ్బందిని, వాలంటీర్లను సిఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డా. రజని , కార్యనిర్వహణాధికారి కె విజయ లక్ష్మి ,ఎన్ ఆర్ ఆర్ పరిశోధన కేంద్రం కమిటీ సభ్యులు డి. శ్రీనివాస రావు , సీఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కె. అజయ్ కుమార్ అభినందించారు. భవిషత్తులో సీఆర్ పాలిక్లినిక్ పరిసరాలలోని ప్రాంతాలలో ప్రతి నెల ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, అలాగే ప్రతి రెండవ శనివారం సిఆర్ పాలిక్లినిక్, రోటరీ ప్రోలిఫిక్స్ డైగ్నోస్టిక్ సెంటర్ లో ఉచిత కన్సల్టేషన్స్ ఇవ్వబడుతుందని, అందరికీ అందుబాటులో విశ్వసనీయ వైద్య సేవలు అందిచటమే లక్క్ష్యంగా పని చేస్తున్నట్లు డైరెక్టర్ డా. రజని పేర్కొన్నారు.
14/12/2025
స్వాతంత్ర సమరయోధులు, సి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపనలో ప్రముఖులు కీర్తిశేషులు శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి గారి 31వ వర్ధంతి సంధర్భంగా సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్, హైదరాబాద్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ లో ఘనంగా నివాళులు అర్పించారు.
సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ, జనరల్ సెక్రెటరీ పల్లా వెంకట్ రెడ్డి, Ex.MLA; శ్రీ నీలం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ శ్రీ నీలం రాజశేఖర్ రెడ్డి గారు కమ్యూనిస్టు నిబద్దత తో ఉన్న ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అలనాటి భారత దేశ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి స్వయాన సోదరుడైనప్పటికీ వారు కమ్యూనిస్టు పార్టీ సమున్నతికినిర్విరామంగా కృషి చేశారు. ముఖ్యంగా పార్టీలో యువకులను ,మేధావులను ప్రోత్సహించారని వక్తలు రాజశేఖర రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.
నీలం రాజశేఖర్ రెడ్డి చండ్ర రాజేశ్వరరావు తో పాటు ఢిల్లీ కేంద్రంగా సి పి ఐ జాతీయ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారని, నీలం రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థులను, యువకులను, పార్టీలో వారిని ప్రోత్సహించారని తెలియజేశారు.
సి ఆర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ కన్వీనర్ కంభంపాటి అజయ్ కుమార్ వందన సమర్పణ చేశారు.
సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ శాసనమండలి సభ్యులు పి జే చంద్రశేఖర్ రావు, సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి• చెన్నకేశవరావు , మహిళా సంక్షేమ కేంద్ర సభ్యులు, జ్యోత్స్న, లలిత, ప్రజానాట్యమండలి గాయని శ్రీమతి నళిని,
సి పి ఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ, ఆశ్రమ వాసులు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ విద్యార్థినిలు, సీ ఆర్ పాలిక్లినిక్ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
14/12/2025
ASK ఫౌండేషన్‌తో కలిసి CR పాలీ క్లినిక్
CR హోమ్ ఫర్ ది ఏజ్డ్ (వృద్ధాశ్రమం) లో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ల కోసం ఒక ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించింది. KIMS హాస్పిటల్స్ ఆర్థో విభాగాధిపతి డాక్టర్ అన్నే సాయి లక్ష్మణ్ (రోబోటిక్ సర్జన్), డాక్టర్ టి మోహిత్ ఎంఎస్ (ఆర్థో) మరియు డాక్టర్ అనూషతో కలిసి ఆశ్రమవాసులకు వారి విలువైన సేవలను అందించారు.
ఆర్థో సమస్యలకు జనరల్ స్క్రీనింగ్:
ఈ సందర్భంగా ఎముక సాంద్రత పరీక్షలు మరియు డాక్టర్ సంప్రదింపులు జరిగాయి.
దాదాపు 72 మంది ఆశ్రమవాసులు ఈ సేవలను పొందారు.
సిఆర్ ఫౌండేషన్ గౌరవ ఛైర్మన్ డాక్టర్ కే. నారాయణ, డాక్టర్ అన్నే సాయి లక్ష్మణ్ గారు, డాక్టర్ టి మోహిత్, డాక్టర్ అనూష మరియు సిబ్బందికి సిఆర్ ఫౌండేషన్ ఆశ్రమవాసులకు అందించిన విలువైన సమయం మరియు సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ నాగరాజు, శ్రీ క్రాంతి( బిడిఎం అసిస్టెంట్). శ్రీ స్వామి, ఫోటోగ్రాఫర్ శిబిరంలో పాల్గొన్నారు.
సీ ఆర్ ఫౌండేషన్ గౌరవ ఛైర్మన్ డాక్టర్ కె నారాయణ, ట్రెజరర్ & హోమ్ డైరెక్టర్ వి చెన్నకేశవ రావు, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె రజని ఈ శిబిరం విజయవంతం కావడానికి సహాయం చేసిన మొత్తం సిబ్బంది మరియు వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
వైద్య శిబిరాన్ని డాక్టర్ కె రజని (డైరెక్టర్ సిఆర్ పాలీ క్లినిక్) ప్రారంభించారు సిఒఒ కె. విజయ పర్యవేక్షించారు.
23/11/2025
సిఆర్ ఫౌండేషన్ లో చిల్డ్రన్స్ లైబ్రరీ ప్రారంభం :
ప్రస్తుతం గూగుల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎంత సమాచారం కావాలంటే అంత పొందగలుగుతున్నప్పటికీ, లైబ్రరీకి వెళ్లి పుస్తకం చదివితేనే మనస్సుకు ఆనందం కలుగుతుందని మనసు ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ మన్నం వెంకట రాయుడు అన్నారు. హైదరాబాద్ కోండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు (సి ఆర్) ఫౌండేషన్ లో గల నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ (ఎన్ ఆర్ ఆర్ ఆర్ సి) లో శనివారం చిల్డ్రన్స్ లైబ్రరీని ముఖ్యఅతిధిగా హాజరైన మన్నం రాయుడు ప్రారంభించారు. ఎన్ ఆర్ ఆర్ ఆర్ సి డైరెక్టర్ డాక్టర్ టి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. కన్వీనర్ కె.అజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర రావు, ఎన్ ఆర్ ఆర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ టి.సురేష్ బాబు, సభ్యులు డాక్టర్ బి.వి.విజయలక్షి సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్న కేశవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నం రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం లైబ్రరీలకు అంత ప్రాధాన్యం లేకపోయినా, 50 ఏళ్ల కింద లైబ్రరీలే మనుషుల విశ్రాంతి స్థలం, జ్ఞాన కేంద్రాలుగా ఉండేవన్నారు. ప్రస్తుతం గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్ ద్వారా సమాచారాన్ని సులభంగా పొందవచ్చు అన్నారు. నేటి జీవితం 50 సంవత్సరాల కంటే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భగత్ సింగ్ లాంటి మహానుభవులే కాకుండా, నేటి తరం వ్యక్తుల నుండి కూడా బాలబాలికలు ప్రేరణ పొందేందుకు ఈ కంప్యూటర్ డిజిటల్ పుస్తకాలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు తాము దాదాపు మూడు కోట్లపైగా పుస్తకాలను డిజిటలైజెషన్ చేశామని వెల్లడించారు. డాక్టర్ వాసిరెడ్డి రమేశ్ బాబు మాట్లాడుతూ కొత్తగూడెంలో ఒకప్పుడు ఎంతో సంప్రదాయంగా బాలోత్సవం నిర్వహించేవాళ్లమన్నారు. 25 ఏళ్ల కింద ప్రతి టా సుమారు 15 వేల మంది పిల్లలు పాల్గొనే ఈ వేడుకకు ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుండి కూడా తెలుగు పిల్లలు వచ్చేవారని గుర్తు చేశారు. 1950, 1960 దశకాలలో గ్రామాల్లో లైబ్రరీలు ప్రజల జ్ఞాన కేంద్రాలుగా ఉండేవన్నారు. పెద్దలు, యువత మాత్రమే కాకుండా మహిళలు కూడా పుస్తకాలు తీసుకుని చదవడంలో చురుకుగా ఉండేవారని తెలిపారు. నేటి కాలంలో లైబ్రరీల సంఖ్య తగ్గిపోయినా, పిల్లల్లో చదువు అలవాటును పెంపొందించడానికి ప్రత్యేక లైబ్రరీ అవసరమని చెప్పారు. చదవడంతో పిల్లల్లో మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. జ్ఞానం అంత పుస్తకాల్లోనే ఉంటుందని చెప్పారు. మనిషిగా, మానవునిగా ఎదగాలంటే పుస్తకాలు చదవాలని డాక్టర్ సురేష్ బాబు సూచించారు. ముప్పాళ్ల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ బాలల వికాసానికి లైబ్రరీలు తోడ్పాటును అందిస్తాయన్నారు. ఖగోళం నుంచి భూగోళం వరకు విజ్ఞానం లైబ్రరీలలో ఉంటుందన్నారు. పుస్తక పఠనం తగ్గిపోవడంతో ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని, ప్రేమాభిమానాలు సన్నగిల్లాయన్నారు. పుస్తక పఠనం ద్వారా అంతరించిపోతున్న మానవ విలువలను కాపాడవచ్చు అన్నారు. సిఆర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్ బి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ఇప్పటికే లైబ్రరీ భవనం ఏర్పాటు చేశామన్నారు. లైబ్రరీలో వ్యవసాయం, ఆర్థిక, రాజకీయ, వాణిజ్యం తదితర సమాచారం ఉంటుందని తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి పుస్తకాలు చదవడం ద్వారా అపారమైన విషయ పరిజ్ఞానాన్ని పొందారని గుర్తు చేశారు. పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమె సూచించారు. డైరి రాయడం కూడా పిల్లలు అలవాటు చేసుకోవాలన్నారు.
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Telephone
Website
Address
CR Foundation, CR Marg, Kondapur
Hyderabad
500084