Jakka Venkat Reddy
Peerzadiguda Municipal Corporation
17/06/2026
ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మేడిపల్లిలోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన, జనరల్ సెక్రటరీ సామ సతీష్ రెడ్డి సమన్వయంతో నిర్వహించిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో బిల్డర్స్ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశానికి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సి. ప్రభాకర్ రావు, ముఖ్య సలహాదారు మరియు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జేపీ విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై విలువైన సూచనలు చేశారు.
ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సెంట్రింగ్, మేస్త్రి కార్మికుల సమ్మె ప్రభావం, TGSPDCL శాఖ నుంచి బిల్డర్లకు ఎదురవుతున్న వివిధ ఇబ్బందులు, అలాగే ఇటీవల ప్రభుత్వం పట్టా భూములు మరియు రిజిస్టర్డ్ ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
ఈ సందర్భంగా బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గావ్యవహరించిన ShreeTMT వారికి కృతజ్ఞతలు తెలిపారు.
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Address
Peerzadiguda Municipal Corporation
Hyderabad
500098