Dr AV Gurava Reddy

Dr AV Gurava Reddy

Share

Dr. A.V.

20/06/2026

గురువుని పూజించడం విన్నాము,
గురువు నేర్పిన బాటలో నడవడం చూసాము,
కానీ, గురువు తపన పడిన ఒక కలకై,
తన నిదుర మరిచి పనిచేయడం,
మన 'నాగి' (నాగ్ అశ్విన్) లోనే చూసాము..!
నాకు నాగిలోని శుశృతభావం ఎంతో ఆకట్టుకుంది..
పుష్పకవిమానం, ఆదిత్య 369
వంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసిన
సింగీతం శ్రీనివాస్ రావు గారి ఆలోచనా ప్రపంచం నుంచి,
జారిన 'బంగారు' స్వప్నాన్ని,
'సింగీతం'గా అసలైన ఐశ్వర్యాన్ని పరిచయం చేస్తూ
తీసిన సినిమా సందర్భంగా,
నాకెంతో సన్నిహితుడు, మా ఇంట్లో మనిషి అయినా
నాగ్ అశ్విన్ తో కూర్చొని, ఓ నీరెండ వేళ,
బోలెడు కబుర్లు, బోలెడన్ని పాటలు,
నాగి నెమరవేసుకున్న జ్ఞాపకాలు..
అన్ని కలగలిపి, ఈ వారం సంగీత సాహిత్య నైవైద్యాన్ని అలంకరించాము!
ఈసారి నా డాక్టర్ పార్టనర్ గా, భార్గవి బదులు,
ఇంకో పాటల, మాటల, సినిమా పిపాసి అయినా మా అబ్బాయి ఆదర్శ్ మాతో కలిసాడు!
అలా ముగ్గురం యువకులం కలిసి,
ఓ మంచి జ్ఞాపకాన్ని వెనకవేసుకున్నాము..
ఆ సాయంత్రపు జ్ఞాపకపు మచ్చు తునక ఇది..
అసలు సరదా రేపు సాయంత్రానికి... గురవా రెడ్డి!

Photos from Dr AV Gurava Reddy's post 15/06/2026

సర్వేజనా సోమవారాలు - అధ్యాయం 13

పోయిన వారం సర్వేజనా సోమారాలలో భాగంగా,
WRI వారి సహకారంతో, ప్రస్తుత కమీషనర్, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ Ms. శ్రీజన ఐఏఎస్ గారిని
సర్వేజనా బృందం కలిసిన విషయాన్నీ పంచుకున్నాను!
ఆ సంభషణకి కార్యరూపం దాలుస్తు,
సైబరాబాద్ పరిధిలోని 74 జుంక్షన్లలో,
pedestrians భద్రతని ప్రధానం చేసుకొని,
ప్రతి జంక్షన్ ని ఎలా రూపుదిద్దాలనే ‘Workshop’
మొన్నీమధ్య CMC ఇంజనీర్స్, ప్లానెర్స్, and ట్రాఫిక్ అధికారులతో జరిగింది!
ఇందులో భాగంగా, ఒక 3 జుంక్షన్లని ఎంచుకొని, పైలట్ ప్రాజెక్ట్ లాగ
సర్వేజనా సౌజన్యంతో.
నడిచేవాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ‘Safer by Design’ అనే పద్దతితో
ఆ జంక్షన్ లని తీర్చిదిద్దాలని భాగ్యస్వాములము అందరం నిర్ణయించుకున్నాము!
వారానికి సుమారు ఐదుగురు, ఈ నిర్లక్యం చేత ప్రాణాలు కోలిపోతున్నారనే
నిజాన్ని జీర్ణించుకోలేక, అందరు ఇలాంటి కార్యక్రమం కోసం ముందుకు రావడం
ఓ రకంగా సర్వేజనా సిద్ధాంతాలని నిజం చేయడం లో మొదటి అడుగుగా భావిస్తున్నాను!
ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ లాలా పాల్గొన్న
డా. జి. శ్రీజన గారు, IAS, కమీషనర్, CMC, మరియు డా. M. రమేష్, IPS, కమీషనర్ అఫ్ పోలీస్, సైబరాబాద్ గార్లకి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు..!
మరింత మెరుగైన మరియు సురక్షితమైన హైదరాబాద్ రోడ్లకై ఆశిస్తూ.. గురవా రెడ్డి!

Gurava Reddy with RRR | Sangeetha Sahitya Naivedyam Episode 10 | Raghu Rama Raju, AP Dep. Speaker 06/06/2026

కాదేది కవితకి అనర్హం
అని శ్రీ శ్రీ గారు అన్నట్టు,
కానివారెవరు సంగీతానికి దాసోహం
అని కూడా అనొచ్చు!
వృత్తి పరంగా ఏ రంగంలో వున్నా,
హారంలో కనపడని దారంలా,
సంగీతం సమస్త కోటిని కలుపుతుంటుంది!
అలాంటి ఒక పెద్ద సంగీత పిపాసి
మా రఘు.. అదే మనందరి RRR (రఘు రామ రాజు)
నాలుగు దశాబ్దాల పరిచయంలో
ఆలా 'రఘు' అంటూ పిలుస్తూ వుంటాను!
రాజకీయాల్లో వుంటూ, ఇటు కళలపై ఆసక్తి,
కళాకారుల ప్రతిభపై అనురక్తి చూపిస్తూ ఉంటాడు రఘు..
అసెంబ్లీ లో 'ఆర్డర్ ఆర్డర్' అనే రఘురామరాజులోని,
సంగీత ప్రేమని ఆవిష్కరించాము
ఈ వారం సంగీత సాహిత్య నైవేద్యంలో.. గురవా రెడ్డి

Gurava Reddy with RRR | Sangeetha Sahitya Naivedyam Episode 10 | Raghu Rama Raju, AP Dep. Speaker కాదేది కవితకి అనర్హం అని శ్రీ శ్రీ గారు అన్నట్టు,కానివారెవరు సంగీ...

01/06/2026

సర్వేజనా అధ్యాయం - 12

రోడ్ ప్రమాదాల్లో,
అత్యంత శాతం ప్రమాదాలు
రోడ్ మీద నడిచే వాళ్లకు జరుగుతుంటాయి!
ఎక్కువ ట్రాఫిక్ వుండే పెద్ద పెద్ద జంక్షన్ లలో
తరచూ ఒక అయోమయంలో,
కొన్ని సార్లు తెలియక, చాలా సార్లు నిర్లక్ష్యం వల్ల
ప్రమాదాలు జరుగుతుంటాయి!
దీని పై ప్రత్యేక దృష్టి సాధిస్తూ,
‘SHIFT (Shaping the Future of Urban Mobility)హైదరాబాద్’ పేరున
హైదరాబాద్ లోని పెద్ద జుంక్షన్లపై ఆరా తీసి,
వాటిల్లో కొన్నిటి పై బాధ్యత సర్వేజనా తీసుకొని,
ఆ జంక్షన్ లలో నడిచే వారికి వీలుగా ఒక ప్రణాళికని తయారు చేసి,
ఆ జుంక్షన్లని Accident Free జుంక్షన్లగా మార్చడమే మా ముఖ్య ఉద్దేశం!
అందులో భాగంగా WRI (World Resources Institute – WRI India) వారి సహకారంతో
Ms. శ్రీజన IAS, కమీషనర్, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గారిని
అలానే మిత్రుడు, మెడికల్ కాలేజీలో సీనియర్ అయినా జయప్రకాశ్ నారాయణ గారిని కూడా సర్వేజనా బృందం ఇటీవలే కలిసింది...
ఒక మంచి ఆలోచనని, స్వచ్ఛమైన తాపత్రయాన్ని,
సమాజానికి మేలు జరగాలనే కోరికని,
ఇలాంటి Like minded people అందరు సహకరించడం,
ఒక చక్కటి అనుసంధానంతో ఇది ముందుకి వెళ్లడం
నాకు బోలెడంత తృప్తిని ఇచ్చింది!
అలానే, మీలో ఎవరైనా, మా ఆలోచనలు, ఆశయాలను అర్థ చేసుకుంటూ,
మీ శక్తి మేర సర్వేజనా కార్యకలాపాలలో భాగం కాగలరు..
అందుకు, సర్వేజనా సోషల్ మీడియా ప్రొఫైల్ లను follow అవుతూ,
మా బృందం తో మీ ఆలోచనలని, మీ సహాయాన్ని పంచుకోగలరు..
హైదరాబాద్ ని SAFErabad గా మార్చే మా ఈ ప్రయత్నంలో,
మీరు అందరు చేతులు కలుపుతారని ఆశిస్తూ.. గురవా రెడ్డి

31/05/2026

స్కూల్లో చదువుకునే రోజుల్లో,
అచ్చం తన తమ్ముడిలా ఉంటానని,
ఒకావిడ నన్ను ‘తమ్ముడి’లా దత్తతు తీసుకుంది!
మెల్లమెల్లగా, కాలం గడిచే కొద్దీ ఆ బంధం
మరింత బలపడింది..!
ఆవిడ చేసే మైసూర్ పాక్ అంటే,
నాకు భలే ఇష్టంగా ఉండేది..
ఇదంతా జరిగి సుమారు 45 ఏళ్ళు,
అయినా, ఇంకా మా ఇద్దరి మధ్య
అదే ఆప్యాయత..!
జీవితంలో కొన్ని బంధాలు భలే గమ్మత్తుగా ఉంటాయి,
మల్లె తీగ అల్లిక లాగ,
ఏ కొమ్మ, ఏ కొమ్మ మీద పడుతుందో,
దాని మీద ఏ పూవు పుడుతుందో ఎవ్వరికి తెలీదు!
అలాంటి ఎన్నో మల్లె తీగలని,
నా జీవితంలో అమర్చినందుకు,
ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞుడిని..
తన తమ్ముడి రూపుని, తెలీకుండానే మోసిన నాపై,
ఇన్నేళ్ళుగా ప్రేమ చూపిస్తూనే..
ఇష్టమైన మైసూర్ పాక్ లని బహుకరిస్తూనే వుంది మా ‘అక్క’!
మొన్నీమధ్య హాస్పిటల్ లో మళ్ళీ కలిస్తే,
ఒక్కసారి మా గతాన్ని నెమరేసుకొని,
భలే ఆశ్చర్య పడ్డాము,
దాన్ని మించి ఆనందపడ్డాము..
బంధాల బలం అలాంటిది..
అవి మైసూర్ పాక్ కంటే బహు రుచి మరి..

Want your practice to be the top-listed Clinic in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Penderghast Road, Opposite Parsi Dharamsala, Behind Paradise Hotel. Secunderabad
Hyderabad
500003

Opening Hours

Monday 8am - 2pm
6pm - 8pm
Tuesday 8am - 11am
2pm - 5pm
Wednesday 8am - 2pm
6pm - 8pm
Thursday 8am - 11am
2pm - 5pm
Friday 8am - 2pm
6pm - 8pm