IHRC
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IHRC, Entrepreneur, Southwest Delhi, Hyderabad.
20/06/2025
20-6-2025
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ ప్రెసిడెంట్
7731000786
🌐🏜🚶🏻🚶🏻♀➖➖➖➖➖➖
నేడు 'ప్రపంచ శరణార్థుల దినోత్సవం' సందర్భంగా..!!
➖➖➖➖➖➖➖
★గతంలో ప్రపంచ యుద్దాలు జరిగినపుడు ఆయా దేశాల ప్రజలు శరణార్థులుగా మారేవారు. కానీ ప్రస్తుతం సంభవిస్తున్న ఉపద్రవాలు,కల్లోలాలు వల్ల కూడా ప్రజలు శరణార్థులుగా మారుతు న్నారు. ఐక్యరాజ్య సమితి వీరి సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి లో ఒక కమిషనరేట్‌ను నియమించి ప్రతీ ఏడాది ఆయా దేశాలలో ఉన్న సమస్యలు, శరణార్థుల వివరాలు సేకరించి వారి పునరావాసానికి చర్యలు చేపడుతొంది. జూన్ 20 వతేదీన అంతర్జాతీయ శరణా ్థుల దినోత్సవంగా నిర్వహిస్తున్నా రు. 2001 నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
■ To escape the violence, they leave everything behind – everything except their hopes and dreams for a safer future. UNHCR, the UN Refugee Agency, believes that all refugees deserve to live in safety.
● We stand together .
Please stand with us.
The petition asks governments to:
● Ensure every refugee child gets an education.
● Ensure every refugee family has somewhere safe to live.
● Ensure every refugee can work or learn new skills to make a positive contribution to their community.
■ శరణార్థులు సర్వం కోల్పోయి రక్షణ కోసం, నివాసం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే వారి భవిష్యత్ అంధకారంగా ఉండరాదు. వారు కూడా నిత్య జనజీవన స్రవంతిలో ఇతర పౌరులు మాదిరిగా జీవించాలన్నదే తన ప్రధాన ధ్యేయమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్ పేర్కొంటున్నారు.
★ నేడు ప్రపంచ దేశాలకు శరణార్ధులు పెద్ద సమస్యగా మారింది. తాజా అంచనాల ప్రపంచ వ్యాప్తంగా 6.5కోట్ల మంది శరణార్థులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.*
■ 1990 ప్రాంతంలో కోట్లాది మంది శరణార్థులు ఏర్పడ్డారు. నాడు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు గల కారణం. నాడు 1.50 కోట్ల మంది తమ తమ స్వంత దేశంలోనే అన్ని ఆస్తులు పోగొట్టుకొని శరణార్థులుగా మారారు. మరో 2.70 కోట్ల మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు.
■ యుద్దాలు సంభవించినపుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, మతకల్లోలాలు జరిగినపుడు శరణార్థులు ఏర్పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి శరణార్దుల కోసం ఒక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కువుగా పాలస్తీనా దేశానికి చెందిన శరణార్ధులు ఎక్కువగా ఉన్నారు. వీరి లెక్కలు చూస్తే పాలస్తీనాకు చెందిన వారు 50లక్షల మంది ఉండగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారు 30 లక్షలు, ఇరాక్ శరణార్తులు 2 లక్షలు, సోమాలియన్లు ఏడు లక్షల మంది ఉన్నారు. ఇంకా కాంగోలియా వాసులు 5 లక్షలు, మయన్మార్ శరణార్దులు 4 లక్షలు, కొలబియన్లు 4 లక్షలు, సూడాన్ దేశస్తులు 4 లక్షల మంది ఉన్నారు. వీరందరి పునరావాసం కోసం ఐక్యరాజ్య సమితి నేటికి కృషి చేస్తూనే ఉంది.
■ సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సోమాలియా, దేశాలలో శరణార్ధుల సంఖ్య గత ఏడాది కంటే 8 శాతం పెరిగింది. దీనికి గల కారణం ఆయా దేశాలలో ఏర్పడిన సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. గత ఏడాది నివేదిక ప్రకారం 4,79,300 క్లయిమ్‌లు 44 దేశాలలో నమోదయ్యాయి. ఇలా ప్రతీ ఏడాది శరణార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
■ 1950 డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి జనరల్‌అసెంబ్లీ సమావేశమై వీరి గురించి తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులతో చర్చించింది. 1951 జూలై 28న వీరికోసం అంతర్జాతీయ చట్టాలను ఏర్పాటు చేసింది. 110 దేశాలలో 6,600 మంది సిబ్బంది శరణార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. 2000 సంవత్సరం డిసెంబరు 4న ఆఫ్రికా దేశానికి ఐక్యరాజ్యసమితి అండగా నిలిచి అక్కడ శరణార్థులను అక్కున చేర్చుకుంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ప్రతి ఏడాది వివిధ దేశాలలో వివిధ స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది.
■ ఈశాన్య ఆసియా దేశాలలో కూడా శరణార్థుల సమస్య నానాటికీ పెరుగుతొంది. గత ఏడాది జపాన్, కొరియా దేశాలలో 3,700 మంది శరణార్థులు మాత్రమే నమో దయ్యారు. అంతకుముందు 28 శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్‌లో శరణార్ధులు ఉన్నారు. ఆ తరువాత స్థానం సిరియాకు చెందుతుంది. చైనా, పాకిస్తాన్ దేశాల నుండి శరణార్థులు క్రమంగా పెరుగుతున్నారు.
■ శరణార్థులలో వృద్దుల నుండి పిల్లల వరకూ ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా యుద్ధాలు జరిగినపుడు శరణార్థులు మన దేశానికి వచ్చి చేరారు. అప్పట్లో వీరి పునరావాసానికి మన దేశం ఎన్నో చర్యలు చేపట్టింది.
◆ మనదేశంలో శరణార్థుల సమస్య పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది.*
★ ప్రపంచంలో ఉన్న 6 కోట్ల మంది శరణార్థులలో 3.50 కోట్ల మందికి పునరావాసం కల్పించగలిగారు. శరణార్థులకు నివాసంతో పాటు వారి పునరావాసానికి తగిన చర్యలు, వైద్యం, వారి పిల్లలకు చదువులు, పౌరసత్వం, ఉపాధిని కల్పించాల్సి ఉంది. కొన్ని దేశాలలో శరణార్థుల వల్ల మత కలహాలు ఏర్పడు తున్నాయి. వాటిని నివారించుకోవాల్సి అవసరం ఉంది. శరణార్థులలో 80 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. యుద్ధ శరణార్థులు కాకుండా క్షామం వల్ల, మత కల్లోలాలు, భూకంపాలు, ఉపద్రవాలు వల్ల ఎంతో మంది తమ జీవనాన్ని కోల్పోయి దుర్భర దారిద్రాన్ని అనుభవి స్తున్నారు. వీరిని అన్ని దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!
30/05/2025
Everyone has the Right to live Free from Poverty and the Chance to Thrive.
The Sustainable Development Goals Aim to help Eradicate Poverty so all People, Everywhere, Can Live with Dignity and Prosperity..!!
29/05/2025
289-05-25
*క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి..?
1.ఎవరిమీదైనా పోలీసులు తప్పుడు ఆరోపణలతో ఒక వ్యక్తి/వ్యక్తులపై అన్యాయంగా క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ను పెట్టి వేధిస్తుంటే ఆ భాధితుడు / బాధితులు వాటిని రద్దు చేయమని సీఆర్పీసిలోని సెక్షన్ 482 ప్రకారం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు..
2.ఎవరైనా ఆర్థిక, అంగబలంతో గాని రాజకీయ పలుకభడితో కక్షపూర్తిముగా ఒక వ్యక్తి మీద తప్పడు కేసుపెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ వ్యక్తి కి ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా తప్పుడు ఆరోపణలతో ఆ కేసులో తనను ఇన్వాల్వ్ చేస్తే ఆ వ్యక్తి తగిన ఆధారాలతో ఆ "ఎఫ్ఐఆర్" ను రద్దు చేయమని ఒకవేళ ఆ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి "చార్జిషీట్" ను ఫైల్ చేస్తే దానిని కూడా రద్దు చేయమని సీఆర్పీసిలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే దానిని క్వాష్ పిటిషన్ అని అంటాము.
3.క్యాష్ పిటిషన్ ను కేవలం హైకోర్టులలో లేదా సుప్రీంకోర్టులో ఫైల్ చేయవచ్చు..
4.ఒకవేళ ఓకే కేసులో ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటే వారిలో, కొందరికి ఆ కేసు ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయం గా ఇరికిస్తే వారు తమ పేర్లును ఎఫ్ఐఆర్ నుండి తొలగించడం కోసం కూడా క్యాష్ పిటిషన్ వేసుకోవచ్చు.ఆ వ్యక్తి నిర్దోషి అని మరియు తప్పుగా చిక్కుకున్నట్లు కోర్టుకు నమ్మితే హైకోర్టు ఆ వ్యక్తి పేరు ను రద్దు చేస్తుంది..
5.ఎఫ్ఐఆర్ను లేదా చార్జిషీట్ను రద్దు చేయడం అనేది కేసులోని వాస్తవాలతో కూడిన ఆధారాలు చూపటం మీద ఆధారపడి ఉంటుంది.
*క్వాష్ అంటే అర్థం..?*
1.క్వాష్ అంటే చెల్లదు, రద్దు చేయడం లేదా చెల్లదని ప్రకటించడం. చట్టపరమైన చర్యలకు ముగింపు పలకడానికి ఉపయోగించబడుతుంది..
2.కొంతమందిపై తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం ద్వారా వారి ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగించేలా ఇతరులను కేసుల్లోకి తప్పుగా ఇస్తారు. ఆ పరిస్థితిలో వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 లోని సెక్షన్ 482 ప్రకారం ఎఫ్ఐఆర్ ను రద్దు చేయమని క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టు/సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఎక్కువగా భార్యలు వారి భర్త మరియు అతని కుటుంబ సభ్యులు మీద అన్యాయంగా పెట్టే ఐపిసి సెక్షన్ 498-ఎ మరియు సెక్షన్ 3 మరియు 4 డి.పి యాక్ట్ కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు రద్దు అవుతున్నాయి..
3.ఒక కేసు తప్పుడు కేసు అని హైకోర్టు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ ను రద్దు చేయవచ్చు..!!
26-5-2025
షేక్ గౌస్
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్- IHRC
నేషనల్ ప్రెసిడెంట్
7731000786
*మానసిక బానిసత్వానికి చరమగీతం.. స్వేచ్ఛాలోచన...!!
ఎవరికి తోచింది వారు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. నీ ఆలోచన, నీ పక్కవాడికి నీ సమాజానికీ నీ దేశానికి, మొత్తం ప్రపంచానికీ పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణీ కాదు, నీ ఇష్టా ఇష్టాల్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వమానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది. అందువల్ల స్వేచ్ఛా లోచనను మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు.
యధార్థాల పునాదిపై వైజ్ఞానిక అవగాహనతో, తర్కబద్ధంగా, హేతు సహితంగా మేధో పరమైన ఒక తాత్త్విక ఆలోచనా ధోరణే స్వేచ్ఛాలోచన..! అయితే ఈ నిర్వచనం ఇలా ఉన్న ఫళాన రూపుదిద్దుకోలేదు. అందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అన్ని బంధాల్ని వదిలేసి భగవదాన్వేషణలో గడిపిన వారు కొందరు, తొలి రోజుల్లో... 'తమదే స్వేచ్ఛాలోచన' అని అనుకున్నారు. అయితే ఆలోచనలు పదునెక్కిన కొద్దీ నిర్వచనం ఇలా మలుపు తిరిగింది. వారి ఆలోచనకే ఎదురు తిరిగింది.
'స్వేచ్ఛాలోచన' ఈ ఆధునిక యుగంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. 'హేతువాదం' అనేది మనకు ముందునుంచీ ఉన్నా, ఈ స్వేచ్ఛాలోచన అనేది దాన్ని కూడా ఇముడ్చుకుని విస్తరించిన అతి పెద్ద విశాలమైన గొడుగు. ఛాందసాన్ని ఖండిస్తూ, మతాల్ని పక్కకు నెట్టేస్తూ, ఎక్కడ దేనితోనూ రాజీపడకుండా ముందుకొచ్చిన ఒక నూతన ఆలోచనా ధోరణీ - స్వేచ్ఛాలోచన! ఫ్రీ థాట్ అనే ఈ 'పదం' పదిహేడో శతాబ్దంలో వాడుకలోకొచ్చింది. సంప్రదాయ బద్ధమైన మతవిశ్వాసాల్ని ప్రశ్నించడానికి అప్పుడు ఈ పదం ఉపయోగపడింది. క్రమంగా వాడుకలోకి వచ్చింది. అయితే పద్దెనిమిదో శతాబ్దంలో విలియం కింగ్‌డన్ క్లిఫర్డ్ అనే గణిత శాస్త్రవేత్త ఈ పదానికి ప్రాచుర్యం తెచ్చాడు. ''అసమగ్రమైన కారణాల్ని, రుజువుల్ని ఎవరూ ఎక్కడా విశ్వసించగూడదు'' అని అన్నాడు.
అంటే అది ఒక వైజ్ఞానిక సిద్ధాంతమైనా కావొచ్చు, లేదా మామూలు విషయమైనా కావొచ్చు. ఏమైనా సరైన కారణాలు, రుజువులు చూపకపోతే అది విశ్వసనీయమైంది కాదని ఖరాఖండీగా తేల్చిచెప్పినవాడు క్లిఫర్డ్. 1870లో ఈ విషయంపై ఆయన ప్రకటించిన వ్యాసం గొప్ప సంచలనం సృష్టించింది. క్లిఫర్డ్ శాస్త్రవేత్తే కాకుండా స్వేచ్ఛాలోచన వ్యాప్తికి నడుం బిగించిన కార్యకర్త కూడా! అందుకే 1878లో ''కాంగ్రెస్ ఆఫ్ లిబరల్ థింకర్స్''ను ఏర్పరిచాడు.
ఈ విశ్వాన్ని నడిపిస్తున్న 'ఒక మహత్తర శక్తి' ఏదో ఉందనే భావనను ఈ స్వేచ్ఛాలోచనా పరులు కొట్టి పారేశారు. సంప్రదాయం, ఛాందసం స్వేచ్ఛాలోచనకు అడ్డంకులవుతాయని గ్రహించారు. బైబిల్‌కు, ఏసుకు రుజువులు కనుగొనడం శుద్ధ దండగ అని అన్నారు. 'కారణం' విధించే షరతులకు ఈ ఉట్టుట్టి అంధవిశ్వాసాలు ఎలాగూ నిలబడవు. అందువల్ల స్వేచ్ఛాలోచనా పరులు 'మతం' అవాస్త మైందని పైగా హాని కారకమైందనీ భావించారు. అదే విషయం ఎలుగెత్తి ప్రకటించారు కూడా!
మతం కోసం మనిషి కాదు, మనిషి కోసం మతం ఏర్పడింది..మానవీయంగా మారేందుకు మతం వదిలేయాలి..సమానత్వం పొందేందుకు మతం వదిలేయాలి..!!
జంతువుల స్పర్శను అనుమతిస్తూ మానవుల స్పర్శను నిషేధించే మతం
మతం కాదు - మూర్ఖత్వం ఒక వర్గాన్ని విద్యకు, సంపదకు దూరం చేసి
బహిష్కరించే మతం - మతం కాదు - దుర్మార్గం.ఇదీ స్వేచ్ఛాలోచనాపరులు చెప్పే విషయాల సారాంశం..! ఎవరెవరో విదేశీయులు చెప్పిన విషయాలు రాస్తారు... మరి మన దేశం మన సంస్కతి, మన విషయాలు రాయరెందుకూ అని ఆక్షేపించే వారిని ఆలోచించమంటున్నాను. మన శాస్త్రవేత్తలు, మన విద్యావేత్తలు, మన కవులూ - కళాకారులూ చెప్పే విషయాలు మన జనం బుర్రకెక్కించుకుంటున్నారా..? కొంచెం ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది కదా..?
చెట్టాపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోరు అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోరు..అన్నారు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు.
మతములన్నియు మాసిపోవును..మానవత్వమె వెలిగి నిలుచును... అని అన్నారు కదా..? ఏదీ మరీ..? మతోన్మాదులతో సమాజంలో ఇన్ని సమస్యలెందుకు వస్తున్నారు..?
సరే, ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక స్వేచ్ఛాలోచనకు గియార్డనో బ్రూనో 1600 సంవత్సరంలో ఒక మైలురాయి అయ్యాడు. పదిహేడో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఇదొక ఉద్యమరూపం తీసుకుంది. బైబిల్‌కు చర్చ్‌లకు (అంటే మత) వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా ఏకతాటిపైకొచ్చారు. కరపత్రాలు, చిరుపొత్తాలూ పంచారు. 1881లో తొలిసారి ''ద ఫ్రీ థింకర్'' పత్రిక బ్రిటన్ నుండి వెలువడింది. సహించలేని మతవాదులు దుర్మార్గమైన దాడులకు, హత్యలకు పాల్పడ్డారు. ఫ్రాన్స్‌లో లా బర్రి అనే యువ కార్యకర్తను చిత్రహింసలు పెట్టారు. అంతే కాదు, అతని మృతదేహాన్ని చితిమీద కాల్చడానికి ముందు తల నరికేసి చంపారు. రోమన్ కాథలిక్‌ల మత ఊరేగింపు సాగిపోతున్నప్పుడు అతను శాల్యూట్ చేయలేదని అభియోగం మోపారు. నిజానికి విషయం అది కాదు.
అతని ఆలోచనా ధోరణికి మత పెద్దలు వణికిపోయారన్నది అసలు నిజం. అతనితో పాటు అతని చితిపై వోల్టేర్ 'ఫిలసాఫికల్ డిక్షనరీ'ని కూడా కాల్చేశారు. ఆ తర్వాత క్రైస్తవ అసహనం ప్రపంచ మానవాళికి గుర్తుండే విధంగా పారిస్‌లో ఒక వీధికి అమరుడైన లా బర్రి పేరు పెట్టడం, ఒక ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ యువకుడు ప్రజా హృదయాల్ని ఎంతగా గెల్చుకున్నాడన్నది అర్థం చేసుకోవాలి. పందొమ్మిదో ఏట 1 జూలై 1766లో అమరుడైన డి లా బర్రి స్మారక స్థూపం దగ్గర మతాన్నీ చర్చ్‌లను అసహ్యించుకునేవారు, మత దారుణాలకు నిరసన తెలిపేవారు ప్రతి ఏటా సుమారు పదిహేను వేల మంది సమావేశమవుతారు. మత క్రౌర్యాన్ని శతాబ్దాలుగా, శాంతియుతంగా చావుదెబ్బ కొట్టడమంటే ఇదే..!
1815-48 మధ్య కాలంలో జర్మనీలో స్వేచ్ఛాలోచన సమాఖ్య ఏర్పడింది. చిన్న చిన్న గ్రూపులన్నీ కలిసి ''యూనియన్ ఆఫ్ ఫ్రీరిలిజియస్ కమ్యూనిటీస్ ఆఫ్ జర్మనీ''గా ఏర్పడింది. అప్పటి వరకూ ఉన్న ఏ మతంలోనూ చేరకుండా, దేనినీ బలపరచకుండా తమకు తామే స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించుకోవడానికి ఒక యూనియన్ ఏర్పాటయ్యింది. పైగా 'స్వేచ్ఛా మానవ వాదు'లంతా తమ సభ్యులేనని ఆ యూనియన్ ప్రకటించుకుంది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హేతువాదుల - నిరీశ్వర వాదుల సంఘాలెన్నో జర్మనీలో రూపుదిద్దుకున్నాయి. అయితే 1933లో అడోల్ఫ్ హిట్లర్ ప్రాభవం పెరిగిన దశలో ఆ సంఘాలు, సమాఖ్యలూ అన్నీ నిషేధానికి గురయ్యాయి.ప్రభుత్వాల ఒత్తిడిగానీ, చర్చ్‌ల పెత్తనం గానీ తమపై ఉండగూడదని బలంగా నమ్మే జర్మన్‌వారు కొందరు అమెరికా వలస వెళ్ళారు. క్రమంగా అక్కడ తమ కార్యక్రమాలు కొనసాగించారు.
ఆ విధంగా జర్మన్ స్వేచ్ఛా పరుల ప్రభావం అక్కడి అమెరికన్‌లపై పడింది. ఫలితంగా 'ఫ్రీ ప్రెస్ అసోసియేషన్', 'ఫ్రీ ఎంక్వైరర్, వర్కింగ్ మెన్స్ పార్టీ', 'ఈక్వల్‌రైట్స్ పార్టీ' వంటి ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. 1800 సంవత్సరాన్ని ''అమెరికా స్వేచ్ఛాలోచన స్వర్ణయుగం'' అని చెప్పొచ్చు. ఎందుకంటే 'నేషనల్ లిబరల్ లీగ్' ఫిలడెల్ఫియాలో ఏర్పడి ఎంతో శక్తివంతంగా పనిచేసింది. 1852లో విస్కాన్‌సిన్‌లో ఏర్పడ్డ ఓ సంఘం ఇప్పటికీ చురుకుగా పనిచేస్తోంది. ద ట్రూల్ సీకర్ సమాఖ్య 1873లో ఏర్పడి పనిచేయడం ప్రారంభించింది. జర్మన్ వలసవాదుల ప్రభావంతో అమెరికాలో 'స్వేచ్ఛాలోచన' ఊపిరి పోసుకుంది.
బెల్జియంలోనూ, నెదర్లాండ్స్‌లోనూ స్వేచ్ఛాలోచనకు ప్రాధాన్యమిచ్చే సంస్థలు బలపడ్డాయి. ముఖ్యంగా నెదర్లాండ్స్‌లో స్వేచ్ఛాలోచన పునాదిగా కొన్ని రాజకీయ పార్టీలే ఏర్పడ్డాయి. 2009లో హేతువాద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ ఏర్పడి తన ప్రభావం చూపడం ప్రారంభించింది.
అలాగే కెనడాలో ''సెక్యులర్ థాట్ హ్యూమనిస్ట్ అసోసియేషన్'' వంటివెన్నో పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాల, మత సంస్థల ప్రమేయం లేకుండా శ్రామిక వర్గానికి చైతన్యవంతమైన, స్వేచ్ఛాలోచనా పూరితమైన, విద్యను అందించాలని ఆలోచనా పరులు యూరోప్‌లో ఒక ప్రణాళికను రూపొందించారు. ఇందులో వైజ్ఞానిక సమాచారానికి, వార్తలకు డార్విన్ పరిణామ సిద్ధాంతానికి, భూసిద్ధాంతానికి, ప్రకృతి అధ్యయనానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ఆ ప్రణాళిక విస్తృతమౌతున్న దశలో క్యూబా, దక్షిణ అమెరికా, లండన్‌లలోని పాఠశాలలు ఆ పాఠ్యాంశాలకు ఆకర్షించబడ్డాయి. పూర్తిగా కాథలిక్ చర్చ్‌ల ఆధీనంలో ఉన్న విద్యావ్యవస్థ కట్టలు తెంచుకుని బయటికి రాసాగింది.
స్వేచ్ఛాలోచనకు ఉన్న విలువ గురించి తత్త్వవేత్త బెట్రండ్ రస్సెల్ 1944 లో ఒక వ్యాసం రాశాడు. అందులో ఆయన ఏమన్నారంటే, తనకున్న విశ్వాసాల్ని ప్రకటించడమే స్వేచ్ఛాలోచనా పరుడి పనికాదు. వాటిని ఏవిధంగా ఎలా ప్రకటించాడన్నది ముఖ్యం. తన పూర్వీకులెవరో చెప్పిన వాటిని యధాతధంగా యుక్తవయసులో విశ్వసించడం కాదు. అదొక మానసిక బానిసత్వం..!! అందులో స్వేచ్ఛాలోచన ఏముందీ..? బుద్దీ, జ్ఞానం పెరిగాక ఆలోచనా శక్తిని ఉపయోగించి ఏర్పరుచుకున్న దృక్పథం ఏదైతే ఉందో... వాస్తవానికి దగ్గరగా ఏదైతే ఉందో.. అది స్వేచ్ఛాలోచన..!!
స్వేచ్ఛాగా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయమే స్వేచ్ఛాలోచన అవుతుంది. అయితే అతను ఇక్కడ రెండు విషయాలలోంచి బయటపడాలి. ఒకటి - సంప్రదాయాల ఒత్తిడికి, ప్రొద్బలానికీ లొంగకుండా ఉండడం. రెండు - అతని ఇష్టా ఇష్టాలలో పడి కొట్టుకుపోకుండా ఉండడం. ఈ రెండింటిలోంచి పూర్తిగా బయటపడడం అంత తేలికైన విషయం కాదు. ఎవరికైనా కష్టమే..! అయితే అసాధ్యం కాదు..!!
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Southwest Delhi
Hyderabad
500060