Mission RK

Mission RK

Share

Working Hand in Hand with All World Gayatri Pariwar , MissionRK

10/01/2026

Vigyanamaya Kosam - Kundalini by Master R K
విజ్ఞానమయ కోశము. - కుండలిని
విజ్ఞానమయ కోశము అంటే అనుభూతితో కూడినది. గాయత్రీ మాత ధ్యానం చేస్నప్పుడు మనస్సుని ఏకాగ్రంగా, తల్లీనతతో, తన్మయత్వముతో చెయ్యాలి. ఆత్మానుభూతి సాధనను అత్యద్భుతంగా వివరించారు. ఇప్పటీవరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఎన్నో సాధనలు ఈ పంచకోశ సాధనలలో వివరించారు.

www.youtube.com

Manomaya Kosher - Kundalini by Master R K 08/01/2026

Manomaya Kosham - Kundalini by Master R K
మనోమయ కోశము :
గాయత్రీ దేవి యొక్క 5 ముఖములను 5 కోశాలుగా ఋషులు వర్ణించారు. సాధకుడు అనే వ్యక్తి ఎప్పుడూ ముందు మనోమయ కోశములో జీవించాలి. మనం అంతా మనువు యొక్క సంతతి. మానవ శరీర ధారులము. ఓం, భూర్, భువ:, స్వహ అనేది దాటి జీవించగలగాలి. మన మనస్సు మీద మనకు పూర్తి ఆధిపత్యం రావాలి. గాయత్రీ మాత ధ్యానము - గాయత్రీ మాత చేతిలో కమండలం - సత్కర్మలు, రెండవ చేతిలో వేదాలు - సదాలోచనలు, ఆవిడ హంస మీద కూర్చుని ఉంటుంది అంటె - విచక్షణా జ్ఞానము, వివేకము, పాలు నీళ్లు ఉంటే పాలను స్వీకరించే గుణం నేర్చుకోవాలి, పద్మము - నిర్లిప్తత, ఈ గుణాలను మనం అభివృధ్ధి చేసుకోవటమే గాయత్రీ ధ్యానం అని మాస్టర్ ఆర్ కె ఈ ప్రవచనంలో ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియచేసారు.

Manomaya Kosher - Kundalini by Master R K Manomaya Kosher - Kundalini by Master R K మనోమయ కోశము :గాయత్రీ దేవి యొక్క 5 ముఖములను 5 కోశాలుగా ఋషులు వర్ణించారు. సాధకుడు అనే వ్యక్తి ఎప్పుడ...

Gayatri Mantra Benefits by Master R K 17/12/2025

https://youtu.be/kkxTx0L5x9s
060196Gayatri Mantra Benefits. గాయత్రీ మంత్రం చెయ్యటం వల్ల కలిగే లాభాలు :
ఆకాశమునుండి కావలసిన శక్తిని, పదార్ధాలను, ఆకాశ తత్వాన్ని ఆకర్షించుకునేందుకు శబ్ఢాన్ని ఉపయోగించుకుంటాము - శబ్ధ తన్మాత్ర. విష్ణువు చేతిలోని శంఖము దీనికి గుర్తు. వాయు తత్వాన్ని స్పర్శతో కొలుస్తాము, స్పర్శలో వేడిని ఉపయోగించుకోవాలి. స్పర్శ=అగ్ని. వేడి ఎక్కువైన కొద్దీ తేజస్సుగా, వెలుతురుగా మారుతుంది. వేడిని తగ్గిస్తే జల తత్వముగా మారుతుంది. శబ్ధ, స్పర్శ, రూప, రస గంధములను సమర్పించటము అంటే ఈ తత్వాలను ఉపయోగించుకుంటూ పంచోపచార పూజ చేస్తాము. ఇవే గాయత్రీ మాత యొక్క 5 ముఖములు. పూజ సమయములో మనము చేస్కొనే సంకల్పమును కిందకి దింపుకోవటమే గాయత్రీ మంత్రము మనకు చెప్తుంది. అవ్యక్తముగా ఉన్న వస్తువులను వ్యక్త స్ధితిలోకి తేవటానికి యజ్ఞమును ఉపయోగించుకుంటాము.

Gayatri Mantra Benefits by Master R K 060196Gayatri Mantra Benefits. గాయత్రీ మంత్రం చెయ్యటం వల్ల కలిగే లాభాలు :ఆకాశమునుండి కావలసిన శక్తిని, పదార్ధాలను, ఆకాశ తత్వాన్ని ఆ.....

Dattatreya Shat Chakra Stotram by Master R K 04/12/2025

గురు బంధువులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు💐
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం.........!!
కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.
1) దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్||
భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.

Dattatreya Shat Chakra Stotram by Master R K Dattatreya Shat Chakra Stotram by Master R Kశ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం.........!!కుండలిని జాగృతికి, దత్...

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Hyderabad