Computer House SALES &services

Computer House SALES &services

Share

We are your one stop technology for all your computer needs. We offer new computers with full warra

04/02/2016

లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే…

రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ ‍టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.

Photos 29/09/2015

మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?
విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది.
విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.
విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు.
ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి.

Photos 18/09/2015

క్రెడిట్ కార్డు అంత చిన్న కంప్యూటర్

కంప్యూటర్ వచ్చిన తొలిరోజులలో పెద్ద గది అంత ఉండేది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా క్రమంగా రూపు మార్చుకొంటూ చిన్నదవుతూ వచ్చింది. డెస్క్‌టాప్, లాప్‌టాప్ చివరకి అరచేతిలో పట్టే మొబైల్ ఫోన్ ఇలా చిన్నది తయారయింది. ఇప్పుడు మరింత చిన్నదిగా అంటే మనం వాడే క్రెడిట్/ఏటియం కార్డు పరిమాణంలో మారిపోయింది. అలా క్రెడిట్ కార్డు అంత ఉన్న కంప్యూటర్ పేరే రాస్ప్‌బెర్రి పై.
యస్‌డి కార్డు ప్రక్కన రాస్ప్‌బెర్రి పై
రాస్ప్‌బెర్రి పై ని కంప్యూటర్ సైన్స్ మూలాల గురించి తక్కువ ఖరీదులో పాఠశాలలలో బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇంగ్లాండు లో ఉన్న రాస్ప్‌బెర్రి పై ఫౌండేషన్ వారు తయారుచేసారు. దీనిని వాణిజ్య పరంగా తయారుచేసి అమ్మడానికి న్యూఆర్క్ ఎలిమెంట్ 14, ఆర్‌యస్ కాంపోనెంట్స్ మరియు ఇగొమెన్ అన్న సంస్థలకి అనుమతి గలదు. రాస్ప్‌బెర్రి పై లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 25 డాలర్లు, ఇంకొకటి 35 డాలర్లు. ఆ సంస్థలు రాస్ప్‌బెర్రి పై ని తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు కొనసాగిస్తారు.
రాస్ప్‌బెర్రి పై లో క్రెడిట్ కార్డు పరిమాణం ఉన్న బోర్డులో కంప్యూటరుగా పనిచేయడానికి కావలసిన అన్ని పరికరాలు అమర్చినారు. దీనిలో 700 మెగా హెర్ట్‌జ్ ప్రాససర్, 250 మెగా హెర్ట్‌జ్ జిపియు, 256 లేదా 512 యంబి రామ్‌, ఒకటి లేదా రెండు యుయస్‌బి పోర్టులు, ఇథర్‌నెట్ పోర్టు, హెచ్‌డియమ్‌ఐ పోర్టు, 3.5 యమ్‌యమ్‌ జాక్, పవర్ కోసం ఒక మైక్రో యుయస్‌బి పోర్టు మరియు యస్‌డి కార్డు స్లాటు ఉన్న ఈ కంప్యూటరు 45 గ్రాములు ఉంటుంది.
రాస్ప్‌బెర్రి పై మోడల్ బి నమూనా చిత్రం

రాస్ప్‌బెర్రి పై లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి రాస్ప్‌బియన్ అను డెబియన్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. రాస్ప్‌బియన్ కాకుండా ఈ చిన్ని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఆపరేటింగ్ సిస్టమును యస్‌డి కార్డులో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

Want your business to be the top-listed Computer & Electronics Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Vanasthali Puram Road
Hyderabad
500070

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm