Cheyutha Charitable Society
సామాజిక మార్పు కోసం....
సాయం చేయడం యువతకి ఒక ఫ్యాషన్ గా మార్చడమే లక్ష్యంగా..
06/07/2024
చేయూత సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించి తన వంతు సహకారం అందిస్తానని తెలియచేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ IAS
కాకినాడ కలెక్టరేట్: సమాజానికి విభిన్న రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న చేయూత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా.యం.రవికుమార్ ను మరియు వారి సభ్యులను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు... ఈ సందర్భముగా గత 1150రోజులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు అన్నదానం, 30వేలకు పైగా రక్త దాతల ద్వారా రక్తదానం చేయించడం, 40మంది చిన్నారులకు ఉచిత విద్య, వైద్యం వసతి భోజన సదుపాయం కల్పించడం, 18మందికి కిరాణా షాపుల స్వయం ఉపాధి కల్పించడం , 70 మంది ఆర్ధిక భారంతో చదువు కొనసాగించలేని నిరుపేద విద్యార్థులకు విద్యని అందించడం, 42 మంది నిరుపేదలకు వైద్య చికిత్స నిమిత్తం ఆర్ధిక సహాయం అందించడం, పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం, బీచ్ శుభ్రత ఇలా అనేక సేవాక్రమాలను చేయడం జరుగుతుందనీ రవికుమార్ తెలిపి కలెక్టర్ సన్మోహన్ కి మొక్కని అందించడం జరిగింది... ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సురభి శారద, సభ్యులు డాక్టర్ సలాడి కిరణ్ కుమార్,చింతా పవన్ కళ్యాణ్, విష్ణు, మనోజ్ చూగని, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు..
19/02/2024
https://youtu.be/AhHWBcCRPl0?si=g_UF0Q3hCGB5ZB-
పిఠాపురం కి చెందిన విద్యార్థి ఉద్యమ సేవకుడికి అండగా
తక్షణ సహాయంగా Rs.30,000/- ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించడం జరిగింది...
వైద్య చికత్సపై డాక్టర్ ల బృందంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది...
పిఠాపురంకి చెందిన శ్రీకాంత్ కి 30వేలు ఆర్ధిక సహాయం #cheyutha #kakinada
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Telephone
Website
Address
Kakinada
13/01/2024