Kvrinfraa projects

Kvrinfraa projects

Share

KVR INFRAA has emerged as one of the front line construction companies in East Godavari. KVR infraa

Photos 27/04/2017

వాలెట్‌లో భద్రం

కార్డులు.. పెన్‌డ్రైవ్‌లు.. బైక్‌ తాళం చెవి.. కరెన్సీ నోట్లు.. కుర్రకారుని నిత్యం అంటిపెట్టుకొని ఉండే వస్తువులు ఎన్నో. వీటన్నింటినీ జేబు లేదా పర్సులో వేసుకొని వెళ్లాలంటే కష్టం. ఈ ప్రయాస తప్పించడానికే ‘వెసెల్‌ కంపార్ట్‌మెంట్‌ వాలెట్‌’ వచ్చింది. ఇందులో నాలుగు అరలుంటాయి. కార్డులు, కరెన్సీ, తాళాలు.. ఇతర విలువైన వస్తువులు ఏవైనా భద్రంగా దాచుకోవచ్చు. మునివేళ్లతో తాకుతూ అరల్ని మార్చేసుకోవచ్చు. ధర రూ.మూడువేలు.

Photos 27/04/2017

మాట వినే లైటు
వార్తలు.. విశేషాలు ఏంటి? పాటలు ప్లే చేయ్‌, ఆకలేస్తోంది పిజ్జా ఆర్డర్‌ ఇవ్వు!
ఇలా మీరు ఏదైనా చెప్పగానే ఠక్కున పసిగట్టి ఆ పని చేసే అసిస్టెంట్‌ మీకు కావాలా! అయితే ఈ లైట్‌తో అది సాధ్యమవుతుంది. లైటు ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని లైట్‌ తీసుకోకండి. ‘జీఈ’కు చెందిన ‘సి’ అనే ఈ ఎల్‌ఈడీ స్మార్ట్‌ ల్యాంప్‌ వెలుగునివ్వడంతో పాటు మీకు సహాయకురాలిగా వ్యవహరిస్తుంది. అంతర్జాలంలో మీకు కావల్సిన వివరాలు తెలపడం, క్రికెట్‌ స్కోరు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ లాంటి పనులు దీని ద్వారా చేసుకోవచ్చన్నమాట. మనుషుల మాటలు విని అర్థం చేసుకొని వాటికి తగ్గట్టు స్పందించే సాంకేతిక లైటు ఇది. అలెక్సా, అమెజాన్‌ల వాయిస్‌ కంట్రోల్‌ సాంకేతికతతో పని చేస్తుంది. దీన్ని తొలుత వైఫైతో కనెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ లైటు అనుబంధ ఆప్‌ను మొబైల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని అనుంసంధానం చేసి మీకు కావల్సిన పనులు చేసుకోవచ్చు. మొబైల్‌లోని ఆప్‌తో ఈ లైట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు కూడా. ఇటీవల విడుదలైన ఈ సాంకేతిక బల్బు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచ మార్కెట్‌లోకి వస్తుంది.

Photos from Kvrinfraa projects's post 27/04/2017

కోహ్లీ బెంగళూరుకు చావో రేవో
గుజరాత్‌ లయన్స్‌తో రెండో పోరు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజన్‌లో దురదృష్టం వెంటాడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నేడు గుజరాత్‌ లయన్స్‌తో రెండో సమరానికి సిద్ధమైంది. సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌ రెండు విజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో దిగాలుపడ్డ కోహ్లీసేన 5 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇక అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్‌ చేరుకోవడం కష్టమే అని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన మ్యాచ్‌ల్లో మిగతా జట్ల ప్రదర్శనను బట్టే కోహ్లీసేన భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది.
బెంగళూరుదే పై చేయి
సీజన్‌లో తలపడ్డ తొలిమ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించలేకపోయింది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కోహ్లీసేనదే విజయం. ఆర్‌సీబీ ఆ మూడుసార్లు 180, 248, 213 స్కోర్లు చేసింది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గుజరాత్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. అతడు ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహమే. ప్రస్తుతం వూపుమీదున్న బ్రెండన్‌ మెక్‌కలమ్‌కు టీ20ల్లో బెంగళూరు స్పిన్నర్లు శామ్యూల్‌ బద్రీ (34 బంతుల్లో 26, 2 సార్లు ఔట్‌), చాహల్‌ (23 బంతుల్లో 20, 3 ఔట్లు)పై మంచి రికార్డు లేదు. ఈ మ్యాచ్‌లో బద్రీ ఆడకపోతే నేగీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అమ్మో.. డివిలియర్స్‌, కోహ్లీ
గుజరాత్‌ లయన్స్‌పై విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉంది. వీరిపై కోహ్లీ సగటు 91, స్ట్రైక్‌రేట్‌ 160.58. ఇక డివిలియర్స్‌ సగటు 228, సగటు 198.26 కావడం గమనార్హం. లయన్స్‌కు పవర్‌ప్లే ఓవర్లలో చెత్త ఎకానమీ (9.80) ఉండటంతో వీరిద్దరూ విరుచుకుపడే అవకాశం ఉంది. గుజరాత్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా సైతం ఆశించిన రీతిలో వికెట్లు తీయడం లేదు. ఈ సీజన్‌లో క్రిస్‌గేల్‌ ఫామ్‌లో లేడు. పవర్‌ప్లేలో ఆడిన 70 బంతుల్లో 69 పరుగులే చేశాడు. అందులో 61.5% డాట్‌బాల్స్‌ కావడం గమనార్హం. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రెండు జట్ల సమరంలో ఎవరు బాగా బౌలింగ్‌ చేస్తారో వారినే విజయం వరించనుంది.

Photos from Kvrinfraa projects's post 22/04/2017

ప్రత్యర్థులకు హైరాణా
ధర లక్షల్లో..
ఆట కోట్లల్లో!

నితీశ్‌ రాణా.. ఇప్పుడు ఐపీఎల్‌ అభిమానుల నోళ్లలో నానుతున్న పేరిది. ముంబయి ఇండియన్స్‌ ఎంతటి లక్ష్యాన్నయినా అలవోకగా ఛేదించేస్తూ వరుస విజయాలతో దూసుకెళ్లిపోతోందంటే అందుకు ప్రధాన కారణం రాణానే. ఈ సీజన్లో రాణా వూపు చూసి.. ఇన్నాళ్లూ ఇతనెక్కడున్నాడో అని అందరూ అనుకుంటున్నారు కానీ.. అతను ముంబయి జట్టుతోనే మూడేళ్లుగా ఉంటున్న సంగతి చాలామందికి తెలియదు. ఈ ఐపీఎల్‌ ఆడటానికి ముందు విజయ్‌ హజారె ట్రోఫీలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. దిల్లీ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అలాంటి వాడు.. ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకోవడం, అదిరిపోయే ప్రదర్శనతో లీగ్‌కే ఆకర్షణగా మారడం ఆశ్చర్యమే!
ఈనాడు క్రీడావిభాగం
అది ముంబయి ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌. ఐపీఎల్‌ పదో సీజన్లో అప్పటికే ఒక మ్యాచ్‌ ఓడి ఒత్తిడిలో ఉంది ముంబయి. సొంతగడ్డపై జరుగుతున్న తర్వాతి మ్యాచ్‌లో నెగ్గి గెలుపు బాట పట్టాలని ఆశతో ఉన్న ఆ జట్టు ముందు 179 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఐతే ఛేదనలో 10 ఓవర్లకు ఆ జట్టు రోహిత్‌ శర్మ సహా మూడు కీలక వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేసింది. సాధించాల్సిన రన్‌రేట్‌ అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు వికెట్లూ నిలవట్లేదు. దీంతో ముంబయికి వరుసగా రెండో ఓటమి ఖాయమని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. కానీ అప్పుడే చెలరేగిపోయాడు 23 ఏళ్ల నితీశ్‌ రాణా. బంతిని బలంగా బాదుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి పేరు.. నేపథ్యమేంటో తెలుసుకునే లోపే మెరుపు వేగంతో అర్ధశతకం పూర్తి చేసేశాడు. ఒక్కసారిగా మ్యాచ్‌ ముంబయి వైపు మొగ్గింది. అంతిమంగా విజయం కూడా ఆ జట్టునే వరించింది. ఆ ఒక్క ఇన్నింగ్స్‌ చూస్తే తెలిసిపోతుంది.. రాణా ఎంత విలువైన ఆటగాడో! ఐతే ఆ ఇన్నింగ్స్‌ గాలివాటమేమీ కాదని తర్వాత మరిన్ని మెరుపులతో రుజువు చేశాడు నితీశ్‌. సన్‌రైజర్స్‌పై 45 పరుగులు (36 బంతుల్లో).. గుజరాత్‌పై 53 పరుగులు (36 బంతుల్లో).. తాజాగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 62 పరుగులు (34 బంతుల్లో).. ఇలా దేనికదే ప్రత్యేకమైన, విలువైన ఇన్నింగ్సే. ఇవన్నీ కూడా ఛేదనలో ఒత్తిడి మధ్య సాధించినవే. ప్రస్తుతం లీగ్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడు అతనే. ఐపీఎల్‌ అనగానే చాలామంది కుర్రాళ్లు అడ్డదిడ్డంగా షాట్లు ఆడటం.. కొత్త షాట్లు ప్రయత్నించడం చేస్తుంటారు. ఐతే రాణా అలా ఆడడు. అతడి షాట్లన్నీ దాదాపుగా సంప్రదాయ తరహాలోనే ఉంటాయి. టైమింగ్‌, శక్తి కలగలిపి ఎలాంటి బంతినైనా అలవోకగా స్టాండ్స్‌లోకి పంపగల నైపుణ్యం అతడి సొంతం. కోల్‌కతా, సన్‌రైజర్స్‌ లాంటి బలమైన బౌలింగ్‌ దళాలున్న జట్లపైనా మెరుపులు మెరిపించాడు నితీశ్‌. తాజాగా కింగ్స్‌ ఎలెవన్‌పై అతను ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేదు. సిక్సర్ల మోతే మోగించాడు. ఏకంగా 7 సిక్సర్లు బాదేశాడు.
పది లక్షలకు సొంతమై..: దిల్లీకి చెందిన రాణా 2015లోనే ఐపీఎల్‌ అవకాశం దక్కించుకున్నాడు. అతడిని రూ.10 లక్షల కనీస ధరకు ముంబయి కొనుక్కుంది. ఐతే ఆ సీజన్లో రాణాకు మ్యాచ్‌ ఆడే అవకాశమే దక్కలేదు. గత సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి, వందకు పైగా పరుగులతో పర్వాలేదనిపించాడు నితీశ్‌. ఐతే ఈ సీజన్లో అతడికి నేరుగా తుది జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఐపీఎల్‌కు ముందు జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారె ట్రోఫీలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి పది పరుగులే చేశాడు. దీంతో అతడిపై దిల్లీ జట్టు వేటు వేసింది. ఐతే దిల్లీ కెప్టెన్‌ గంభీర్‌ మాత్రం అతడిపై భరోసా ఉంచాడు. రాణాపై వేటు వేయడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ భాస్కర్‌పై విమర్శలు గుప్పించాడు. కష్టకాలంలో రాణాకు మద్దతుగా నిలిచాడు. గంభీర్‌ సలహాలతో రాణా ఆట మెరుగుపడటమే కాదు.. అతడిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తనేంటో రుజువు చేసుకోవడానికి ఐపీఎల్‌ రూపంలో అతడికి చక్కటి అవకాశం దొరికింది. విశేషం ఏంటంటే.. రాణా ఏంటో అందరికీ తెలిసింది గంభీర్‌ నేతృత్వంలోని నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లోనే. రాణా వల్ల తన జట్టు ఓడినప్పటికీ.. తాను నమ్మకం పెట్టిన ఆటగాడు అలా రాణించడం గంభీర్‌కు సంతోషాన్నే ఇచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. కేవలం పది లక్షలకు ముంబయి సొంతమైన రాణా.. ఇప్పుడు కోట్ల విలువైన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

Want your business to be the top-listed Realtor/realty Service in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Bhanugudi
Kakinada
533001