Trinity, peddapally

Trinity, peddapally

Share

To meet former students of trinity Institutions

16/10/2019

ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం!

బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.

జార్జిరెడ్డి జీవితం ఇతివృత్తంగా నిర్మించిన చలన చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానిని ప్రోమోట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా ఇటీవల హన్స్ ఇండియా వంటి పత్రికలతో పాటు సామాజిక మాధ్యమ గ్రూపులలో అతనిని కీర్తిస్తూ వ్యాసాల పరంపర మొదలైంది. కొన్ని వ్యాసాల్లో అతడిని ఏకంగా సమాజోద్ధారకుడుగా అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి జీవితంలో మీడియా మనకు చూపని చీకటి కోణాన్ని మీ ముందుంచే ప్రయత్నం ఇది:

ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి ప్రస్థానం:

1969-70 మధ్యకాలంలో అర్జెంటీనా మార్క్సిస్ట్ చే గువేరా అడుగుజాడల్లో నడవాలనుకునే ఒక విద్యార్ధి బృందం ఏర్పడింది. దీనికి జార్జిరెడ్డి నేతృత్వం వహించాడు.
జార్జిరెడ్డి తల్లి కేరళ క్రిష్టియన్, తండ్రి చిత్తూరు ప్రాంతానికి చెందినవాడు. జార్జిరెడ్డి 8 ఏళ్ల వయసున్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ కుటుంబ పరిస్థితుల ప్రభావం అతడిపై తీవ్రంగా ఉండేది.

కాలేజీ రోజుల్లో నక్సలిజం ఉద్యమానికి ఆకర్షితుడైన జార్జిరెడ్డి మార్క్సిజం గురించి అధ్యయనం చేశాడు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులకు జార్జిరెడ్డి స్వయంగా నకుల్ డస్టర్, కత్తులు, ఇతర పదునైన మారణాయుధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చాడు. తమ సైద్ధాంతిక మూలాలు బయటపడకుండా ఉండడం కోసం ఈ బృందం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్.ఎస్.యు.ఐ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆవిధంగా కాంగ్రెస్ నాయకుల అండదండలు కూడా పొందగలిగారు. అలా పనిచేస్తూ చే గువేరా హింసాయుత సిద్ధాంతాన్ని విద్యార్థులకు భోధించేవాడు. ఎన్.ఎస్.యు.ఐ వంటి కాంగ్రెస్ అనుబంధ సంస్థల ద్వారా తమ పొత్తును కొనసాగిస్తూ రాజకీయంగా తమ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం ఆరోజుల్లోనే ఉంది.

హింసాయుత నక్సల్ సిద్ధాంతమే స్ఫూర్తిగా:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో సాయుధ తిరుగుబాటు జరుగుతున్న సమయమది. 1968 – 72 మధ్య నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఈ హింసాత్మక ఘటనలో 156 మంది ప్రజలను ‘వర్గ శత్రువులు’గా పేర్కొంటూ నక్సలైట్లు తుదముట్టించారు. అది ఆనాటి హింసాత్మకతకు నిదర్శనం. ప్రముఖంగా మహిళలు, పిల్లలు ఈ హింసావాదానికి బలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మధ్యయుగం నాటి క్రూరాత్మక ఘటనలను తలపించే విధంగా బాధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు కూడా భయపడే వాతావరణం సృష్టించారు. ప్రత్యర్ధులను హత్యచేసి, వారి అవయవాలను ముక్కలుగా కోసి వారి ఇంటికే వేలాడదీసేవారు. తలలను తెగనరికి వెదురు కర్రలకు వేలాడదీసి ఇంటి ఎదుట పాతేవారు. ‘నిందితులు’గా తాము ముద్రవేసినవారిని కుటుంబ సభ్యుల ముందే హింసించి కిరాతకంగా హత్యచేసేవారు. అలా చంపినవారి రక్తంతోనే గోడలపై `విప్లవ’ నినాదాలు రాసేవారు.

జార్జిరెడ్డి – క్రూరమైన హింసా ప్రవృత్తికి ప్రతిరూపం:

“నీ చేతులు వర్గశత్రువు రక్తంతో తడవనంతకాలం నువ్వు నిజమైన కమ్యూనిస్టువి కావు”

మావోయిజం తాలుకు ఈ నినాదాన్ని జార్జిరెడ్డి తన బృందంలోని విద్యార్థులను హింసవైపు ప్రేరేపించేందుకు ఎంచుకున్నాడు.
(రెఫెరెన్స్: శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు రాసిన ‘మావోయిజం’ అనే పుస్తకంలోనిది)

1968 నుండి జార్జిరెడ్డిపై 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1970లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇద్దరు న్యాయవిద్యార్ధులపై హత్యాప్రయత్నం చేశాడు. అంతకు పూర్వం వరకు ఆంధ్రప్రదేశ్ లోని ఏ యూనివర్సిటీ ప్రాంగణంలోనూ ఇటువంటి హింసాత్మక ఘటన జరగలేదు. ఇది యూనివర్సిటీ విద్యార్థులలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అతడిని బహిష్కరించింది. కానీ కొన్ని వారాల్లోపే కొన్ని ఒత్తిళ్ల కారణంగా జార్జిరెడ్డి బహిష్కరణ నిర్ణయాన్ని యూనివర్సిటీ వెనక్కి తీసుకుంది.

అప్పటికి జార్జిరెడ్డి విద్యార్థి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. కానీ నిజానికి అతను గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. 1970లో ఏబీవీపీ హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల విద్యార్థి ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ సైన్స్ కాలేజీ ఎన్నికల్లో జార్జి రెడ్డి నిలబెట్టిన అభ్యర్ధి ఓటమిపాలయ్యాడు కూడా. దీనితో ఏబీవీపీ పై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు విద్యార్ధులందరికి ఒక `గుణపాఠం’ నేర్పాలని జార్జ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

ఓయూ ప్రాంగణంలో జార్జిరెడ్డి వీరంగం:
1971లో జార్జిరెడ్డి తన బృందంతో జీపులో తిరుగుతూ విద్యార్థులలో భయాందోళనలు సృష్టించేవాడు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఏబీవీపీ విద్యార్థి సి.హెచ్. నరసింహారెడ్డిని ఓయూ హాస్టల్ నుండి బయటకు లాగి, హాకీ బ్యాట్లు, ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటి లా కళాశాల యూనియన్ ప్రెసిడెంట్ పై చేసిన జార్జ్ రెడ్డి బృందం చేసిన దాడిలో దవడ ఎముకలు విరిగి, బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఏబీవీపీ నాయకుడిని ఏకంగా ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. చివరికి చనిపోయాడనుకుని ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేసి పోయారు. అప్పటి ఏబీవీపీ హైదరాబాద్ నేతతోపాటు మరికొందరు విద్యార్ధులపై కూడా ఇలాంటి దాడే జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హింసాత్మక ఘటనలను చూసీచూడనట్టు వ్యవహరించింది. దానితో ఏబీవీపీ విద్యార్థులే లక్ష్యంగా జార్జిరెడ్డి హింసాత్మక చర్యలు మరింత పెరిగాయి.

జార్జిరెడ్డి మరణం.. అనంతర పరిణామాలు:
1972 ఏప్రిల్ 14న విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడే జార్జిరెడ్డి తన బృందంతో కలిసి ఇంజనీరింగ్ హాస్టల్ మీద దాడిచేశాడు. జార్జిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కాదు, ఆ కళాశాల హాస్టల్ కు అతడికి సంబంధం కూడా లేదు. జార్జిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా పోటీచేస్తున్న విద్యార్థి నివసిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోకి వెళ్లాల్సిన అవసరం అతడికి ఏమొచ్చింది? ఆ సమయంలో అక్కడ జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయాడు.

మరుసటి రోజు దినపత్రికలలో ‘ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి నేత జార్జిరెడ్డి మరణం వెనుక ఏబీవీపీ, ఆరెస్సెస్’ అని ఆరోపిస్తూ వార్తలు వచ్చాయి. విచిత్రమేమిటంటే ఏ పత్రికా జార్జిరెడ్డి నేరచరిత్రను కనీసం ప్రస్తావించలేదు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీని పూర్తిగా తుదముట్టించేందుకు ఇదొక అవకాశంగా కాంగ్రెస్ ఈ హత్యను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.

ఏబీవీపీ విద్యార్ధులపై నేరారోపణ – హైకోర్టు క్లీన్ చిట్:
ఈ హత్యకేసులో 9 మంది విద్యార్ధులపై చార్జిషీట్ నమోదైంది. 6 నెలలపాటు జైలులో ఉన్న వీరిని ట్రయిల్ కోర్ట్ నిర్దోషులుగా విడుదల చేసింది. వారి విడుదల రోజు ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థులు ఓయూ ప్రాంగణంలో “కోర్టులు కాదు, మేము బహిరంగ తీర్పు చెప్పి శిక్షీస్తాం” అంటూ నినాదాలిచ్చారు. ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్ధించింది. ఈ న్యాయపోరాటంలో ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో వేదనకు, కష్టాలకు గురయ్యారు.

ముగింపు:
కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం.. గత రెండు దశాబ్దాలలో (1998-2018) జార్జిరెడ్డి ఆశయసాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే సంస్థలు సాగించిన మారణహోమంలో దాదాపు 12000 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 8000 మంది సాధారణ పౌరులున్నారు. బీబీసి వార్తా సంస్థ సర్వే ప్రకారం జార్జిరెడ్డి హింసాత్మక సిద్ధాంతానికి బలైన వ్యక్తుల సంఖ్య 6000.

ఇలాంటి నేర చరిత్ర, ద్వేషం, విధ్వంస స్వభావం కలిగిన వ్యక్తులను వీరులుగా, హీరోలుగా కీర్తించే ప్రయత్నాలను సమాజం మేలు కోరుకునేవారు అడ్డుకునే తీరాలి.

Source: www.arisebharat.com లో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదం

RSS Chief Mohan Bhagat Participates Ganesh Shobha Yatra In Hyderabad | V6 Telugu News 12/09/2019

భారత్ మాత కి జయ్
జై శ్రీ రాం
జై అఖండ హిందు రాష్ట్ర
జై అఖండ భారత్

RSS Chief Mohan Bhagat Participates Ganesh Shobha Yatra In Hyderabad | V6 Telugu News గణేష్ నిమజ్జనం Live https://www.youtube.com/watch?v=MD-VpcFxLys ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం https://www.youtube.com/watch?v=MD-VpcFxLys ► Subscribe to V6 News T...

06/08/2019

Shyam Prasad Mukherjee was strongly opposed to Article 370 seeing it as a threat to the unity of the country and fought against it inside and outside the parliament with one of the goals of Bharatiya Jana Sangh being the abrogation of the article. His dream to repeal Article 370 saw the day of light on 5 August 2019 with the bill being tabled in Rajya Sabha. He died in the custody of Abdulla led government of J&K in 1953.Mysterious conditions suspected primary reason was heart attack. The then opposition alleged Nehru & J&K police for the conspiracy.Since BJP is the successor party of Bhartiya Jana Sangh, Mukherjee is regarded as the founder of BJP too.His dream come true this August 5th 2019.

Jai shree ram
Jai akand bharath.

Want your school to be the top-listed School/college in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Peddapalli
Karimnagar
505172