Poodur

Poodur

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poodur, Landmark & historical place, Poodur, Karimnagar.

08/04/2026

*భక్తి అవసరం కానీ విద్య మరియు ఆరోగ్యం అత్యవసరం*

“గ్రామంలో ఆధ్యాత్మిక చింతన పెరగడం మంచిదే… కానీ బడి మరియు ఆరోగ్యం ప్రాధాన్యత కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి.
బడి మరియు గ్రామంలోని ప్రజలు ఆరోగ్యాంగా ఉంటేనే గ్రామం బాగుంటుంది.”
“గుడి మనసుకు శాంతి ఇస్తుంది… బడి భవిష్యత్తు నిర్మిస్తుంది.”

మన గ్రామంలో గుడులు ఉన్నాయి, భక్తి ఉంది, పండుగలు ఘనంగా ఒకరితో ఒకరం పోటి పడుతూ జరుపుకుంటున్నాం ఇది చాలా మంచి విషయం.
కానీ ఒక చిన్న ప్రశ్న మనం మనకు మనమే అడగాలి…
మనం గుడికి ఇస్తున్న ప్రాధాన్యత, మన బడికి ఇస్తున్నామా?
గుడి మనకు ఆధ్యాత్మిక శాంతి ఇస్తుంది…
కానీ బడి మన పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది.
ఇప్పుడు మన గ్రామంలో గుడికి విరాళాలు ఇస్తున్నాం కాని బడికి మరియు ప్రభుత్వ దావకాన కి ఎంతమంది విరాళాలు ఇవ్వడానికి రెడీగా వున్నారు. సేవలు చేస్తున్నాం…
కానీ బడిలో పరిస్థితి ఎలా ఉంది?
పిల్లలకు సరైన సౌకర్యాలు ఉన్నాయా?
మన బడి బలంగా ఉందా? అని ఏరోజు ఆలోచించట్లేదు డబ్బులు పెట్టి మరి కరీంనగర్ మల్యాల గంగాధర జగిత్యాల లాంటి పట్టణాలకి డబ్బులు ఎంత అంటే అంతా పెట్టి చదివిస్తున్నాం. అదే మన గ్రామం లొ మన బడిని బాగుచేసుకొని అన్ని సౌకర్యాలని కల్పించి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులని అడుగలేమా మా పిల్లలకి మంచి విద్య ఇవ్వండి అని ఒక్కసారి మంచి ఫలితాలు రావడం స్టార్ ఐతే అందరి తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పిస్తారు.
చదువుకున్న పిల్లలు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది.
పేదరికం తగ్గుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, గ్రామానికి గౌరవం పెరుగుతుంది.
మన బడిని ప్రభుత్వ దవాఖాన ని అభివృద్ధి చేద్దాం
పిల్లల చదువుకు ఆరోగ్యానికి మన బడికి ప్రభుత్వ దావకాన కి కూడా ప్రాధాన్యత ఇద్దాం ✊🏻.

Photos from Poodur's post 05/04/2026

పూడూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మా అరపల్లి గ్రామ పరిస్థితి గడ్డితో నిండిన డ్రైనేజీ దీని కారణంగా దోమల బేడుదా ఎక్కువ గా వున్నది. గ్రామ సర్పంచ్ గారు పాలక వర్గం పారిశుధ్యం మీద ద్రుష్టి సారించి దోమల బెడదా నుండి కాపాడగలరు.🙏🏻🙏🏻

23/03/2026

no to
***a

driving

Want your organization to be the top-listed Government Service in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Poodur
Karimnagar
505501