Ismart Maths Karimnagar
Maths App
ఒక వ్యక్తి మోసగాడని మీకు తెలుసు .
వాడితో సంభంధం కుదుర్చుకోవడానికి మీరు ఇష్టపడుతారా ?
{ ఉదాహరణకు మీ ఇంటి అమ్మాయిని .. మీ వయసు బట్టి మీ చెల్లి / అక్క / కూతురు } వాడికిచ్చి పెళ్లి చెయ్యడం } .
లేదు కదా !
వాడెంత ఆస్తిపరుడైనా.. మీరు ఒప్పుకోరు .
కారణం ..". వాడు మోసగాడు .
మనల్ని { అంటే మీరు , మీ కుటుంబం , మీ ఇంటి అమ్మాయి } కూడా మోసం చేస్తాడు.. అని అనుకొంటారు .
దూరం జరిగిపోతారు .
కదా ?
సమాజం కూడా వ్యక్తి లాంటిదే .
వ్యక్తుల సమూహమే కదా ... సమాజం అంటే .
సమాజం తన మనుగడ కోసం మోసగాళ్లను , నేరస్థులను సహించదు . శిక్షిస్తుంది . వెలివేస్తుంది .
అడ్డదారిలో పైకి రావడం కష్టమా ?సులభమా ?
సాధారణంకంటే కాస్త ఎక్కువ తేలితేటలు , కష్టించే తత్త్వం , కాస్త లక్ ఉంటే ఐఏఎస్ కొట్టేయొచ్చు .
రాచ మార్గంలో పైకి రావడం పెద్ద కష్టమేమి కాదు .
శ్రమ.. ఓపిక.. కష్టించే తత్త్వం ఉంటే చాలు .
అడ్డదారుల్లో పైకి రావడం చాలా సులభం .
కానీ అది ఎక్కువ కాలం నిలవదు .
కేసుల్లో ఇరుక్కొని లేదా క్రైమ్ వలయం లో చిక్కి త్వరలో అధోగతి పాలు కావడం ఖాయం .
చెంచల్ గూడా .. చర్లపల్లి.. రాజముండ్రి జైలు గోడలు వేలాది కథలు చెబుతాయి .
{ అవినీతి చేసి.. కేసులకు చిక్కకుండా ఇంతమంది దర్జాగా బతికేస్తున్నారు అని మీరు అనుకొంటున్నారు కదా ? చిక్కి జైలుకు పోవడం ఒక విధంగా బెటర్ . టెన్షన్స్ తో ఒళ్ళు రోగాల పుట్టగా మారి .. బినామీ బంధువుల చేతికి చిక్కి లేదా అడ్డగోలు సంపాదనతో పిల్లలు అడ్డదారులు తొక్కితే యాభై అరవై వయసులో నరకాన్ని అనుభవిస్తున్న వారెందరో . సైడ్ ఎఫెక్ట్స్ ను మరిస్తే ఎలాగండీ ?}
అడ్డదారుల్లో పైకొచ్చి అక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం .
అసాధారణ తెలివితేటలున్న వారికే అది సాధ్యం .
దావూద్ ఇబ్రహీం , చార్లెస్ శోభరాజ్ , వీరప్పన్ , భింద్రన్వాలే, హర్షద్ మెహతా .. ఇలా ఎన్ని ఉదహారణలు అయినా చెప్పొచ్చు .
అడవిలో పుట్టి పెరిగి , చేతిలో డబ్బు వ్యవస్థలు ఏమీ లేకుండా తానే ఒక వ్యవస్థగా ఎదిగి రెండు రాష్ట్రాల పోలీస్ ను , అటవీ అధికారులను అనేక సంవత్సరాల పాటు ముప్పు తిప్పలు పెట్టడం సినిమా రచయితల ఊహకు కూడా అందని ఒక ఫాంటసీ .
నిజమయిన ఆ సినిమా ప్రియుల ఫాంటసి వీరప్పన్ .
ఆర్మీ , పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేరుంటే అతని స్థాయి ఎలా ఉండేది ?
బహుశా గిల్, దోవల్, ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ ల కంటే మించి పేరు ప్రఖ్యాతులు సంపాదించివుండేవాడు .
కానీ వీరప్పన్ బతుకు ఎలా ముగిసింది ?
కారణం సంఘవ్యతిరేక దారి .
హర్షద్ మెహతా .. ఆ మాటకొస్తే ఆర్థిక మోసాలు చేసేవారందరూ తెలివైన వారే ! ఒక వ్యక్తిని బురిడీ కొట్టించాలి అంటే ఎంతో కష్టం . అలాంటిది వేల మందిని బురిడీ కొట్టించడం , వ్యవస్థల్లో లోపాలతో సిరిని కూడా బెట్టడం అంటే మహా టెలివితేటలు కావాలి .
హర్షద్ మెహతా ది ఒక స్థాయి .
చార్లెస్ శోభరాజ్ ది ఇంకో స్థాయి .
వీడో బికినీ కిల్లర్ . అందమయిన అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం డబ్బులు గుంజడం చంపడం , జైలు నుంచి తప్పించుకోవడం .. ఇవన్నీ మాటలా? ఎంత తెలివితేటలుండాలి ?
హర్షద్ మెహతా కృత్రిమంగా ఒక షేర్ ధర పెంచుతాడు . అబ్బో ఇందులో గ్రోత్ ఉందని మీరు కొంటారు . బాగా రేట్ వచ్చాక వాడు దాన్ని అమ్మేస్తాడు . ఆ పై ఆ షేర్ ధర పాతాళంలోకి . మీ డబ్బు ఆవిరి .
మీ డబ్బును వాడు ఆలా కొట్టేసాడన్న మాట .
తెలివంటే .. ఉండదా అండీ ?
బస్సు స్టాండ్ లో.. రైల్వే స్టేషన్ పర్సు కొట్టేసేవాడికి లేవా?
మీరు ట్రై చెయ్యండి . ఒక్క నిముషంలో దొరికి తన్నులు తింటారు .
వాడికి అందులో ఎన్ని మెళుకువలు ? శిక్షణ ? "పర్సు అజాగ్రత్తగా పెట్టుకోవడం మీ తప్పు .. వాడు తేలితేటలు వాడాడు " అంటే ఎలా ఉంటుంది ?
కన్ఫ్యూజ్ కావొద్దు .
వీరప్పన్ వల్ల వందలాది ఏనుగులు మరణించాయి . అపార అటవీ సంపద నాశనం అయ్యింది .
హర్షద్ మెహతా వల్ల మునిగిన వారెందరో !
సినిమా మధ్యలో ఆపెయ్యొద్దు .
అడ్డ దారి హీరో ల సినిమా లు ఇంటర్వెల్ కు ఒకలా ఉంటాయి .
ఆ రోజుల్లో యువకుల కాశ్మీరీ ఆపిల్ రామ్ తేరి గంగా మైలి మందాకినీ .
ఆడి కన్ను పడింది .
ఎత్తుకు పోయాడు .
ఆమెనేనా ?
ఎంత మందినో !
అక్బర్... జహంగీర్ ఆస్థానంలో కంటే వాడి దుబాయ్ డెన్స్ లో ఎక్కువ బ్యూటీస్ వుంటారు . అనుభవించాడు .
నిజమే .
మీరు ఆడి సినిమా దుబాయ్ సీన్ తో ఆపేస్తే ఎలా ?
ఇంటర్వెల్ తరువాత సీన్ కరాచీ కి షిఫ్ట్ అయ్యింది
కరాచీ సందుల్లో .. రోగాల శరీరం తో నక్కి నక్కి బతుకుతున్నాడు .
వీరప్పన్ లాగే కుక్క చావు గ్యారెంటీ .
ఐదేళ్లు యూరోపియన్ బికినీ బ్యూటీ లు.. ఇప్పుడు ఇరవై ఏళ్లుగా నేపాల్ జైలు ..
పోలా? .. పోలా?... లెక్క సరిపోలా!
లైఫ్ ప్రతోడి లెక్క సెటిల్ చేస్తుంది .
హిందువులు దీన్నే కర్మ అన్నారు .
గ్రీకులు కాస్మిక్ రెట్రిబ్యూషన్ అన్నారు .
దేవుడ్ని నమ్మని వారు మోరల్ డెటెర్మినిజం అన్నారు .
పేర్ల గోల ఎందుకు లెద్దు.
ఇది నిజం నిజం నిజం .
చచ్చిన ఫరవాలేదు.. ఒక్క రోజు అనుభవించి పోవాలి అనుకోవడం .. యూట్యూబ్ తెలివి .
1. కష్టాన్ని నమ్ముకొంటాను .
2. స్మార్ట్ వర్క్ చేస్తాను .
3. నా ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉండేలా చూసుకొంటాను .
4. అనవసర ఆడంబరాలకు పోను .
5 అవతలి వారితో పోల్చుకోను . పోల్చుకున్నా కేవలం పాజిటివ్ విషయాల్లో .. స్ఫూర్తి దాయకంగా ఉండేదుకే .
6 సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం . దాన్ని చట్టబద్ధమయిన మార్గం లో సంపాదిస్తాను .
7 కేవలం డబ్బే సంతోషం కాదు . డబ్బు కు బానిస కాను . స్టేటస్ కు బానిస కాను . కుటుంబం , ఆత్మీయత అనురాగం , బంధుత్వం స్నేహం హాబీ ఇలా లైఫ్ కు ఎన్నో కోణాలు . 360 డిగ్రీస్ లైఫ్ అనుభవిస్తాను .
8 మంచితనం అంటే చేతకాని తనం కాదు . దీని సిలబస్ వేరు . దాని సిలబస్ వేరు . నేను కన్ఫ్యూజ్ కాను . జనాల్ని కన్ఫ్యూజ్ చెయ్యను .
కావాలి ఇదే మీ ఎజెండా .. ముఖ్యంగా ఇరవై ముప్పై లో ఉన్న యూత్ కు ..
శుభోదయం .
Facebook post by
Amarnath Vasireddy
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Vaninikethan PG College Road , JyothiNagar
Karimnagar
505302