Challur Village

Challur Village

Share

Challur is a Village in Veenavanka Mandal in Karimnagar District of Telangana State, India, This is official page of Challur Village.

06/05/2014

సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే - స్థానికత ఆధారంగా విభజన జరగాల్సిందే - స్పష్టం చేసిన తెలంగాణవాదులు - తాజాగా సీఎస్ వ్యాఖ్యలపై మండిపాటు - మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో స్థానికత ఆధారంగా విభజన జరగాల్సిందే.. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కన్నుంచి వెళ్లిపోవాల్సిందే.. ఇన్నాళ్లు ఉద్యమం చేసింది, తెలంగాణ కోసం కొట్లాడిందీ అందుకోసమే. ఆప్షన్లు అసలే వద్దు.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.. అంటూ జిల్లాలోని తెలంగాణవాదులు టీ మీడియాతో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రకటించడంపై మండిపడుతున్నారు. ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. (టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో):ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఇస్తే తెలంగాణ కు తీరని అన్యాయం జరుగుతుందనీ, తెలంగాణలోనూ ఆంధ్రోళ్ల పాలనే కొనసాగుతుందని జిల్లా, రాష్ట్ర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇటీవల విభజనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్లు ఉం టాయని చెప్పడాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆప్షన్లు ఇస్తే ఈ ప్రాంతం నుంచి వెళ్లే సీ మాంధ్ర ఉద్యోగుల సంఖ్య స్పల్పమని వాదిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాపోతున్నారు. ఆప్షన్లు ఎలా ఇస్తారనేది ఈ నెల 8 వరకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తుండగా, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి స్పందించేందుకు టీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అక్కడా ఇక్కడా ఆంధ్ర పెత్తనమే.. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఆస్తులు, అ ప్పులు, భవనాలు ఉభయ రాష్ర్టాలకూ కేటాయిం చే ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఇక ఉద్యోగుల విభజన ఇపుడు కీలకంగా మారింది. ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలనే ఆలోచనను తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్షన్లు ఇస్తేగనక ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనమే నడుస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లతో నిమిత్తం లేకుండా, స్థానికత ఆధారంగా విభజన జరగాలని పట్టుబడుతున్నారు. ఆప్షన్ల పేరుతో ఉభయ రా ష్ర్టాల ఉద్యోగుల మధ్య గందర గోళాన్ని సష్టిస్తున్నారని వాదిస్తున్నారు. విభజన ప్రారంభం కాకముందే ఆప్షన్లపై వ్యతిరేకత వ్యక్తం చేయాలని తె లంగాణ ఉద్యోగులు పట్టుపడుతున్నారు. తెలంగాణకు 42, సీమాంధ్రకు 58 శాతం చొప్పున జనా భా ప్రాతిపదికన, స్థానికత ఆధారంగానే విభజన ఉండాలని కోరుతున్నారు. ఆప్షన్లు ఇస్తే తెలంగాణ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లరని వారు స్పష్టం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇప్పటికే రెండు విషయాల్లో అన్యాయం జరిగిందని, ఇక ని యామకాల విషయంలో కూడా అన్యాయం చే యాలని చూస్తే సహించలేమని, మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణ ఉద్యోగ సం ఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. నియామకాల్లోనే అన్యాయం.. సీమాంధ్ర ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో జరిపిన లాబీయింగ్, పక్షపాత వైఖరి కా రణంగా తెలంగాణ ఉద్యోగులకు ఆది నుంచే అ న్యాయమే జరిగిందని ఇక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో 30 శాతం, రాష్ట్ర కేడర్‌లో 40 శాతం, జిల్లా స్థాయి కేడర్‌లో కేవలం 20 శాతం ఉద్యోగులను నియమించారని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ 20శాతంలోనూ మెరిట్ కోటా కింద మరో 20 శాతం మందిని సీమాంధ్ర ఉద్యోగులతో నింపార నే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయం జరిగినా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణ ప్రాంత ఉద్యోగుల గోడు వినిపించుకున్నవారు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలోనే పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమం మహోద్యమమై స్వరాష్ర్టాన్ని సాధించుకుంది. ఇప్పుడు కూడా ఆప్షన్ల పేరిట నియామకాల విషయాన్ని మళ్లీ మొదటికి తేవాలని సీమాంధ్రకు చెం దిన ఉన్నతాధికారులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. ఆప్షన్లు ఉంటే మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇక్కడి నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లరని, వారి స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశాలుండవని, దీంతో కొత్త రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదని కూడా పలువురు తెలంగాణ ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. ఆప్షన్లుంటే ఎలా ఉంటాయి.. రాష్ట్ర పునర్విభన నేపథ్యంలో ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే ప్రధానంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చె బుతున్నారు. ఒక ప్రాంతంలో పని చేస్తూ విర మణకు ఐదేళ్ల సర్వీసున్న ఉద్యోగులకు ఏ రాష్ట్రం లో ఉండాలో నిర్ణయించుకునేందుకు మొదటి ఆప్షన్ ఇవ్వనున్నారు. భార్యాభర్తలు వేర్వేరు రాష్ర్టాలకు వెళ్లాల్సి వస్తే స్పౌస్ కింద ఇద్దరు ఒకే రాష్ట్రంలో పని చేసేలా ఇంకో ఆప్షన్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలో ని ర్ణయించుకునేందుకు మరో ఆప్షన్, వికలాంగుల కు ప్రాధాన్యతనిస్తూ చివరి ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్థానిక, జిల్లా, జోనల్ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగుల విభజన జరిగే అవకాశాలుంటాయని ఉద్యోగ సం ఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

05/05/2014

12న మున్సిపల్, 13న పరిషత్,16న సార్వత్రిక ఫలితాలు -బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో 6309 మంది జాతకాలు -రోజులు లెక్కపెడుతున్న అభ్యర్థులు - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు 12, 13, 16.. ప్రస్తుతం అందరి చూపూ ఈ మూడు తేదీలపైనే నెలకొంది. మార్చి 30న మున్సిపోల్స్‌తో మొదలైన ఎన్నికల జాతర, ఏప్రిల్ 6,11లలో పరిషత్ ఎన్నికలతో వేడెక్కి, 30న సార్వత్రిక సమరంతో ముగియగా, 6309 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వరుసగా మున్సిపల్, పరిషత్, జమిలి ఎన్నికల ఫలితాలు రానుండగా, అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -టీ మీడియా, కరీంనగర్ (టీ మీడియా, కరీంనగర్):మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11తేదీల్లో పరిషత్, 30న సార్వత్రిక ఎన్నికలు ముగియగా, ఆయాచోట్ల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వెలువడనున్న ఫలితాలపై అందరి దష్టీ నెలకొంది. సుప్రీం జోక్యంతో ఫలితాలు వాయిదా.. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏప్రిల్ 2న ప్రకటిస్తామని వెల్లడించిన అధికారులు, ఆ తర్వాత 9కి వాయిదావేశారు. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత వారంలోగా ప్రకటించాల్సి ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫలితాలు ప్రకటిస్తే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న వాటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ రెండు ఎన్నికల ఫలితాలను వాయిదా వేసింది. తుది విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాక, ఈ నెల 12, 13, 16 తేదీల్లో ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తేలనున్న 6309 మంది భవితవ్యం.. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో మొత్తం 236 డివిజన్లు/ వార్డులుండగా, 2166 మంది పోటీపడ్డారు. 57 జడ్పీటీసీ స్థానాలకుగాను 365 మంది, 804 ఎంపీటీసీ స్థానాలకు (817 స్థానాల్లో13 ఏకగ్రీవం) 3576 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 168 మంది, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలో 34 మంది పోటీపడ్డారు. మొత్తం మీద 6309 మంది భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఫలితాలపై ఉత్కంఠ.. కాగా వరుస ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థులకు నెలరోజులుగా ఎదురుచూపులే మిగిలాయి. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి. పరిషత్, సార్వత్రిక అభ్యర్థులూ రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న 12, 13, 16 తేదీలపై అందరి దష్టీ నెలకొంది. గెలిచేదెవరో, ఓడేదెవరో ఆయా రోజుల్లో తేలనుండగా, మున్సిపల్, జడ్పీ ఫలితాల తర్వాత రాజకీయం రసకందాయంలో పడనుంది. చైర్మన్లు, చైర్‌పర్సన్ల ఎన్నికలెప్పుడో?! మున్సిపల్, పరిషత్ ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు చైర్మన్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగాల్సి ఉంటుంది. 16న సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ తర్వాత నిర్వహిస్తారా? ఆలోగానే పూర్తిచేస్తారా? అనేదానిపై స్పష్టత కరువైంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఫలితాల లోపు చైర్మన్లను ఎన్నుకుంటే కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముండదు. ప్రస్తుత ఎంపీలకు మాత్రం వారు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటేసే అవకాశం కల్పిస్తారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత చైర్మన్ల ఎన్నికలు జరిగితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటేసే అవకాశం ఉంటుంది. లెక్కింపు ఇక్కడ.. -కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఈవీఎంలను సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో భద్రపరిచారు. 12న ఇక్కడే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించి గోదావరిఖని నూతన మున్సిపల్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.జమ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును కరీంనగర్ మండలం చింతకుంట గురుకుల పాఠశాలలో, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల మున్సిపాలిటీల లెక్కింపును జగిత్యాల ప్రభుత్వ కళాశాలలో, పెద్దపల్లి నగరపంచాయతీ ఓట్ల లెక్కింపును రామగుండంలో చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. - పరిషత్ ఎన్నికలకు సంబంధించి, ఈ నెల 13న ఆయా డివిజన్ల పరిధిలో జరుగుతుంది. -సాధారణ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లిలోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లో చేపడతారు. ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరీంనగర్ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజవర్గాల లెక్కింపు సెయింట్ ఆల్పోన్స్ పాఠశాలలో, పెద్దపల్లి లోక్‌సభ స్థానం, పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపు ఉజ్వల పార్కు సమీపంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉంటుంది. ఈ మేరకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఆయా తేదీల కోసం అభ్యర్థులతోపాటూ ప్రజలూ ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Want your business to be the top-listed Finance Company in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Address


Veenavanka Mandal
Karimnagar
505505