Challa Vamshi Chand Reddy

Challa Vamshi Chand Reddy

Share

Special Invitee, Congress Working Committee. AICC Secretary. Ex MLA from Kalwakurthy,Telangana State. Ex State President- Youth Congress & NSUI.

10/05/2026

మన విజయానికి నిశ్శబ్ద కారణం...
మన కన్నీళ్ల వెనుక నిలిచే ధైర్యం...
మన నవ్వుల వెనుక దాగిన త్యాగం...

ప్రతి తల్లి ప్రేమకు వందనం...
అమ్మలందరికీ హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు.

01/05/2026

చెమట చుక్కలతో...
చరిత్రను చెక్కే చేతులకు వందనం...

శ్రమతో సమాజాన్ని నిలబెట్టే...
శ్రమజీవులందరికీ...

ప్రపంచ కార్మిక దినోత్సవం...
సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు..!

Happy International Labour Day!

Photos from Challa Vamshi Chand Reddy's post 19/04/2026

ప్రజాసేవలో...
చిరస్మరణీయుడు భాస్కర్ రెడ్డి...

ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గోకారం మాజీ సర్పంచ్ అంతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఈ రోజు పరామర్శించి, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాను.

భాస్కర్ రెడ్డి గారు 38 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ జెండాను ఎప్పుడూ వదలకుండా ప్రజల మధ్యే ఉండి సేవలందించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, ప్రజల మనిషిగా ఆయన పొందిన ఆదరణ నిజంగా విశేషం. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

క్రియాశీల నాయకుడిగా, సాగునీటి సంఘం అధ్యక్షుడిగా, సర్పంచ్‌గా, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి బాధ్యతల్లో ఆయన చేసిన సేవలు అభినందనీయమైనవి. ఆయన అకాల మరణం పార్టీకి, ప్రాంతానికి తీరని లోటు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in New?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


AICC, 24-Akbar Road
New