Surya Prathap Reddy
Official page of Bhumireddy Surya Prathap Reddy.
21/05/2026
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలిసారిగా కడప గడ్డపై అడుగుపెట్టిన గౌరవ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కడప ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది.
యువత ఆశయాలకు ప్రతిరూపంగా, రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికతను తోడుచేస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ అన్న గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని నమ్ముతున్నాను.
16/04/2026
మన యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, మైస్పేస్ అకాడమీ (Myspace Academy) ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరులో నిర్వహించనున్న '1st Open National Taekwondo Championship - 2026' కి సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది.
క్రీడల పట్ల మక్కువ చూపే యువతను ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అందుకే మన కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. సలీం మాస్టర్ శిక్షణలో మన పిల్లలు జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవ్వడం గర్వకారణం.
క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి మారుపేరైన టైక్వాండో వంటి క్రీడల్లో మన ప్రాంత క్రీడాకారులు రాణించి, మన ఊరి పేరును దేశస్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు. క్రీడాకారులకు నా వంతు సహకారం, మన ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Proddatur